Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్ టార్గెట్ లైన్ బ్లాస్ట్.. 3 రోజుల్లో ఎంతంటే

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ మొత్తానికి తన కెరీర్ లో మరో బిగ్ సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   1 April 2024 6:34 AM GMT
టిల్లు స్క్వేర్ టార్గెట్ లైన్ బ్లాస్ట్.. 3 రోజుల్లో ఎంతంటే
X

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ మొత్తానికి తన కెరీర్ లో మరో బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అతనికి బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే అంత ఈజీగా దక్కలేదు. నెగటివ్ రోల్స్ చేసుకుంటూ మొదట తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. ఇక తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోగా అవకాశాలు అందుకుంటూ వచ్చాడు.


మొత్తానికి డీజే టిల్లు క్యారెక్టర్ తో ఆడియన్స్ కు చాలా దగ్గరయిపోయాడు. ఇక దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బాక్సాఫీస్ వద్ద మరింత హైలెట్ అవుతోంది. సొంతంగా డెవలప్ చేసుకున్న కథతో సిద్దు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నాడు. ఈ విధానం ఇండస్ట్రీలో చాలామందికి ఒక ప్రేరణగా నిలుస్తుంది అని చెప్పవచ్చు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఊహించని స్థాయిలో లాభాలు అందిస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమా ఈ వీకెండ్ లో ఆడియన్స్ కు బెస్ట్ ఛాయిస్ గా మారిపోతుంది. పోటీగా కూడా పెద్దగా సినిమాలు లేవు కాబట్టి సమ్మర్లో ఈ సినిమా మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. నిర్మాత నాగ వంశీ కూడా ముందుగానే ఈ సినిమా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశాడు.

ఇక సినిమా అనుకున్నట్లుగానే ఆ దిశగా అడుగులు వేస్తోంది. మొదటి రోజే 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకొని ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ తర్వాత రెండవ రోజు కూడా అదే రేంజ్ లో సత్తా చాటిన టిల్లు స్క్వేర్ మూడో రోజు కూడా సండే ను చాలా చక్కగా ఉపయోగించుకుంది. ఇక మొత్తానికి వీకెండ్ లో ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ 60 కోట్లను దాటడం విశేషం.

మొత్తంగా 3 రోజుల్లో 68.1 కోట్లు గ్రాస్ వచ్చినట్లు సమాచారం. అందుకు సంబంధించిన పోస్టర్స్ కూడా మేకర్స్ విడుదల చేశారు. 100 కోట్ల దిశగా టిల్లు స్క్వేర్ కొనసాగడం పక్కా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక మొత్తానికి అనుకున్న టార్గెట్ ను కూడా ఈ సినిమా ఫినిష్ చేసింది. 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పుడు 30 కోట్ల షేర్ కలెక్షన్స్ దాటి బయ్యర్లకు మంచి ప్రాఫిట్ అందిస్తోంది.

ఆదివారం వరకు వీకెండ్ లో సినిమా బాగానే హడావిడి చేసింది. ఇక సోమవారం నుంచి అసలు గేమ్ మొదలుకానుంది. అంతేకాకుండా వచ్చేవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా రాబోతోంది. కాబట్టి టిల్లు స్క్వేర్ ఇదే తరహాలో సందడి చేస్తే మాత్రం బయ్యర్లకు మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చాలెంజ్ టైంలో టిల్లు స్క్వేర్ ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.