Begin typing your search above and press return to search.

ఇంకోటా.. అప్పుడే తొందరెందుకు టిల్లు?

డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 March 2024 9:51 AM GMT
ఇంకోటా.. అప్పుడే తొందరెందుకు టిల్లు?
X

డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే సాలీడ్ ఓపెనింగ్స్ దక్కాయి. దాదాపు 23.7 కోట్ల గ్రాస్ ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సిద్దు జొన్నలగడ్డ మరోసారి టిల్లు క్యారెక్టర్ తో అదిరిపోయే వినోదాన్ని అందించారు. రెండు గంటల పాటు ప్రేక్షకుల హాయిగా నవ్వుకునే విధంగా ఈ మూవీ ఉందనే టాక్ వినిపిస్తోంది.

సినీ విశ్లేషకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అనుపమ పరమేశ్వరన్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ అద్భుతంగా కనెక్ట్ అయ్యారని అంటున్నారు. టిల్లు స్క్వేర్ తో మొత్తానికి సిద్దు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకొని తన రేంజ్ ను అయితే పెంచుకున్నాడు. దీంతో లాంగ్ రన్ లో ఈ చిత్రానికి సాలిడ్ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని నిర్మాత నాగ వంశీ బలంగా నమ్ముతున్నారు.

ప్రస్తుతం మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా పట్ల పబ్లిక్ ఎంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే టిల్లు క్యారెక్టర్ కి కొనసాగింపు ఉంటుందా అనే సందేహాలు మొన్నటి వరకు ఉండేవి. టిల్లు స్క్వేర్ మూవీలో కూడా పార్ట్ 3పై ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా సక్సెస్ మీట్ లో నిర్మాత నాగ వంశీ టిల్లు పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందని చెప్పాడు.

టిల్లు క్యారెక్టర్ తో ఆడియన్స్ హ్యాపీగా జర్నీ చేసేంత వరకు సీక్వెల్స్ ఉంటాయని చెప్పారు. అయితే వీకెండ్ లో వచ్చిన ప్రింట్ లో సమయాభావం వలన పార్ట్ 3కి లీడ్ ఇవ్వలేకపోయామని చెప్పారు. సోమవారం నుంచి థియేటర్స్ లో అందుబాటులో ఉండే ప్రింట్ లో క్లైమాక్స్ లో పార్ట్ 3కి లీడ్ పాయింట్ ఉంటుందని, కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆ సీక్వెన్స్ నచ్చుతుందని చెప్పారు.

అయితే సీక్వెల్ ఎప్పుడు ఉంటుందనేది కన్ఫర్మ్ చేయడానికి సమయం పడుతుందని అన్నారు. టిల్లు స్క్వేర్ కి అద్భుతమైన ఆదరణ వస్తోన్న నేపథ్యంలోనే ఈ సిరీస్ కొనసాగించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. టిల్లు క్యారెక్టర్ ను కొనసాగింపు అనేది మంచి విషయమే.. కానీ కాస్త తొందరపడ కుండా గ్యాప్ ఇస్తే బెటర్ అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

బలమైన కంటెంట్ ఉంటే తప్ప అస్సలు రిస్క్ తీసుకోకుడదు. సిద్దు పై సితార వారు సీక్వెల్ కోసం గట్టిగానే ఖర్చు చేశారు. ఇక మరో సినిమా అంటే స్క్రిప్ట్ దశలోనే మినిమం ఉండేలా జాగ్రత్త పడాలి. మళ్ళీ వెంటవెంటనే క్యాష్ చేసుకోవాలని చూస్తే టిల్లు క్యారెక్టర్ బోర్ కొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఫలితాన్ని బట్టి ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.