Begin typing your search above and press return to search.

టిల్లు క్యూబ్.. ఆమెకు లక్కీ ఛాన్స్!

దీంతో ఆ పాత్రతో మరిన్ని సినిమాలు తేవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

By:  Tupaki Desk   |   2 May 2024 3:47 PM GMT
టిల్లు క్యూబ్.. ఆమెకు లక్కీ ఛాన్స్!
X

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా క్రైమ్ కామెడీ ఫ్రాంచైజీ డీజే టిల్లుకు మంచి రెస్పాన్స్ దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో ఫస్ట్ మూవీ డీజే టిల్లు.. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ మూవీతో సిద్ధు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. తన డైలాగ్స్, యాక్టింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆ పాత్రతో మరిన్ని సినిమాలు తేవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.


అందులో భాగంగా డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సిద్ధు కెరీర్ లో ఫస్ట్ రూ.100 కోట్ల మూవీగా నిలిచింది. డీజే టిల్లు కన్నా పెద్ద హిట్ అయింది. దీంతో మేకర్స్ టిల్లు క్యూబ్ ను కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా గడుపుతున్నారు.

అయితే ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నేహా శెట్టి నటించగా.. టిల్లు స్క్వేర్ లో మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది. ఇద్దరూ తమ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. ఇప్పుడు మూడో పార్ట్ కోసం పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా.. పూజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.

ఇక పూజా హెగ్డేకు కొన్ని నెలలుగా కలిసి రావడం లేదు. ఈ బ్యూటీ నటించిన వరుస చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజ కాస్త సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్‌ ఇచ్చి ఫ్రీ టైం అంతా తన ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపేస్తుందట. ఇక టిల్లు క్యూబ్ లో ఆమెకు ఛాన్స్ వచ్చిందన్న వార్త విని ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. పూజకు లక్కీ ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు.

అయితే టిల్లు క్యూబ్ కు హీరోయిన్ తోపాటు డైరెక్టర్ కూడా మారుతున్నట్లు తెలుస్తోంది. మూడో పార్ట్ ను మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించనున్నట్లు టాక్. మ్యాడ్ స్క్వేర్ కంప్లీట్ అయ్యాక ఆయన టిల్లు క్యూబ్ ను స్టార్ట్ చేయనున్నారని సమాచారం. టిల్లు స్క్వేర్ కు కూడా కళ్యాణ్ శంకర్ కొన్ని పంచ్ డైలాగ్స్ అందించారని ఆ మధ్య సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మరి టిల్లు క్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.