Begin typing your search above and press return to search.

టైగర్ vs కేసరి.. ఇది నెవ్వర్ బిఫోర్ ఫైట్

ఈ దసరా టాలీవుడ్ బాక్సాఫీస్ పోటీ రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ఈ సారి నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ మాహారాజా రవితేజ తమ చిత్రాలతో పోటీపడనున్నారు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 2:21 PM GMT
టైగర్ vs కేసరి.. ఇది నెవ్వర్ బిఫోర్ ఫైట్
X

ఈ దసరా టాలీవుడ్ బాక్సాఫీస్ పోటీ రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ఈ సారి నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ మాహారాజా రవితేజ తమ చిత్రాలతో పోటీపడనున్నారు. 'భగవంత్ కేసరి'తో(అక్టోబర్ 19) బాలయ్య పవర్​ఫుల్​గా వస్తుండగా.. 'టైగర్​ నాగేశ్వరరావు'తో(అక్టోబర్ 20) గజదొంగగా రానున్నారు రవితేజ. అయితే ఈ ఇద్దరు బడా హీరోలు బాక్సాఫీస్​ ముందు పోటీపడేది తొలిసారేం కాదు.

గతంలో పలుసార్లు పోటిపడ్డారు. అయితే అప్పుడు వీరిద్దరిలో రవితేజదే చాలాసార్లు పై చేయి నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎవరు పైచేయి సాధించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ప్రేక్షకులు ఏ చిత్రానికి ఓటు వేస్తారనే చర్చ మొదలైంది. అయితే ఓ సినిమా మొదటి రోజు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే.. ఆ సినిమాలో నటించే హీరో లేదా దర్శకుడిపైనే ఆధారపడి ఉంటుంది.

తర్వాత రోజు నుంచి రప్పించాలంటే కథపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. భగవంత్​ కేసరి విషయానికొస్తే.. ఈ సినిమాకు చాలా ప్లస్​ పాయింట్లు ఉన్నాయి. మొదటిది బాలయ్య అన్​స్టాపబుల్​ క్రేజ్​.. అఖండ నుంచి బాలయ్య ఫేట్​ మారిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. దీంతోనే ఈ కొత్త సినిమాకు కావాల్సినంత హైప్​ వచ్చేసింది.

దానికి తోడు ఈ సినిమాను తెరకెక్కించేది సక్సెస్​ఫుల్​ ఫన్ డైరెక్టర్​ అనిల్ రావిపూడి. నవ్వించడంలో ఆయన దిట్ట. ఈసారి సారి బాలయ్య యాక్షన్​కు తన మార్క్​ కామెడీని జోడించి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి తోడు సినిమాలో హీరోయిన్​గా కాజల్ అగర్వాల్ ఉండటం, అలాగే ఫుల్​ ఫామ్​లో ఉన్న యంగ్ అండ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ఉండటం పెద్ద ప్లస్​ అనే చెప్పాలి. ఇప్పటికే రిలీజైన టీజర్ కూడా బాగా ఆకట్టుకుంది. అలా ఈ సీనిమాకు ఎన్నో కలిసొచ్చే అంశాలు ఉన్నాయి. కాబట్టి మొదటి రోజు ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్​ ఎలాగో దక్కుతాయి.

మరి రవితేజ టైగర్ నాగేశ్వరరావు విషయానికొస్తే.. ఈ చిత్రానికి రవితేజనే పెద్ద ప్లస్​. పాన్ ఇండియా లెవల్​లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. స్టూవర్ట్​పురం గజదొంగ బయోపిక్ ఆధారంగా దీన్ని తెరెకక్కిస్తున్నారు. రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇదే చిత్రంతో రేణూ దేశాయ్​ నటిగా రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్​ గ్లింప్స్​ కూడా బానే ఆకట్టుకుంది.

రవితేజ వైల్డ్ లుక్​లో కనిపించడం వంటి అంశాలు.. చిత్రంపై ఆడియెన్స్​లో భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం దర్శకుడు విషయానికొస్తే.. వంకీ కృష్ణ అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. ఈయన గతంలో తీసిన సినిమాలను పరీశిలిస్తే రక్షక భటుడు, జక్కన్న, దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి చిత్రాలను తెరకెక్కించారు. మొదటి రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినప్పటికీ దొంగాట ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకు దర్శకుడి ట్రాక్​ రికార్డ్​తో కాకుండా రవితేజ ఇమేజ్​తో మంచి ఓపెనింగ్సే వస్తాయి.

అయితే ఈ రెండు చిత్రాలకు తమిళ డబ్బింగ్ సినిమా దళపతి విజయ్​ లియో కూడా పోటీగా వస్తోంది. విక్రమ్​ వంటి బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్న దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కించిన సినిమా కావడం భారీగా అంచన్నాలు ఉన్నాయి. ఎంతకాదనుకున్న బాలయ్య-రవితేజ ఫ్యాన్స్​ మొదటి ఓటు తమ హీరోలకే వేస్తారు. లియో టాక్ బయటకు వచ్చాకే తమ అభిమాన హీరో సినిమా చూసి ఆ సినిమా చూస్తారు. చూడాలి మరి ఈ మూడు చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందో.. ప్రేక్షకులు యంగ్ డైరెక్టర్​ వంశీ ప్రయోగానికి ఓటు వేస్తారో, లేదంటే సీనియర్ అండ్ సక్సెస్​ఫుల్​ అనిల్ రావిపూడి మాస్ కామెడీని ఆదరిస్తారో లేదా లోకేశ్​ మాస్​యాక్షన్​ వైపు మొగ్గుతారో..