Begin typing your search above and press return to search.

ఆ యాక్ష‌న్ స్టార్ కి గాల్లో ఎగ‌ర‌డం అంటే భ‌య‌మా?

అత‌డి క‌టౌ ట్...మెలితిరిగిన దేశం చూస్తే వంద‌శాతం యాక్ష‌న్ చిత్రాల‌కు న్యాయం చేసే ఏకైక స్టార్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే భారీ యాక్ష‌న్ చిత్రాల‌తో తానేంటో నిరూపించాడు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 5:41 AM GMT
ఆ యాక్ష‌న్  స్టార్ కి గాల్లో ఎగ‌ర‌డం అంటే భ‌య‌మా?
X

యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా టైగ‌ర్ ష్రాప్ ఇప్పుడు ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ స్టంట్స్ చేయాలంటే? అత‌ను మాత్ర‌మే చేయాలి అన్నంత‌గా పేరు సంపాదించాడు. అత‌డి క‌టౌ ట్...మెలితిరిగిన దేశం చూస్తే వంద‌శాతం యాక్ష‌న్ చిత్రాల‌కు న్యాయం చేసే ఏకైక స్టార్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే భారీ యాక్ష‌న్ చిత్రాల‌తో తానేంటో నిరూపించాడు.

యాక్ష‌న్ చిత్రాల్లో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మ‌రి అలాంటి యాక్ష‌న్ స్టార్ కి గాల్లోకి ఎగ‌ర‌డం అంటే భ‌య‌మా? ప్లైట్ చూస్తేనే ప‌రేషాన్ అవుతాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం టైగ‌ర్ ష్రాప్ -అక్ష‌య్ కుమార్ హీరోలుగా 'బడే మియాన్ చోటే మియాన్' అనే యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలున్నాయి.

అయితే ఈ సినిమా అనుభ‌వాల్ని ఓ చాట్ షోలో టైగ‌ర్ ష్రాప్ హోస్ట్ నేహా దూపియాతో పంచుకున్నాడు. త‌న‌కి గాల్లోకి ఎగ‌రాలంటే భ‌యంగా ఉంటుంద‌ని అన్నాడు. ఈ సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాలు షూట్ చేసే స‌మ‌యంలో విమానంలో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు త‌న‌కంతా గంద‌ర‌గోళంగా అనిపించింద‌ని..అంత‌కు ముందు యాంగ్జైటీకి గురైన‌ట్లు తెలిపాడు. ప్లైట్ లో యాక్ష‌న్ స‌న్నివేశాలు అన‌గానే ప్రతీసారి ఇలాంటి ఆందోళ‌న‌కి గుర‌వుతాన‌ని అన్నాడు.

కొంత‌కాలం ఇలాంటి స‌న్నివేశాల‌కు దూరంగా ఉన్నాన‌ని..మ‌ళ్లీ అవి ప్రారంభం అవ్వ‌డంతో త‌న‌లో విచిత్ర‌మైన భ‌యం కూడా నెల‌కుంద‌ని తెలిపాడు. షూటింగ్ లో భాగంగా విమానంలో రెండు గంట‌ల పాటు కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించామ‌ని ప్ర‌యాణిస్తున్న విమానం గాల్లో ఎలా ఊగుతుందో..ఆ స‌మ‌యంలో త‌న జీవితం కూడా క‌ళ్ల ముందు క‌నిపించింద‌ని అన్నాడు.