Begin typing your search above and press return to search.

జై సినిమా.. టైగర్ స్పీచ్ ఫ్యాన్స్ ఫిదా..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:13 AM GMT
జై సినిమా.. టైగర్ స్పీచ్ ఫ్యాన్స్ ఫిదా..!
X

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ నెల 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగింది. రవితేజ అవకాశం ఇచ్చిన దర్శకులు ఆయనతో పనిచేసిన ప్రొడ్యూసర్స్ తో పాటుగా ముఖ్య అతిథిగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ ఈవెంట్ కు వచ్చారు.

ఈ ఈవెంట్ లో రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ మాస్ రాజా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈవెంట్ కి వచ్చిన గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి థాంక్స్ చెప్పిన రవితేజ తన తమ్ముళ్లతో పాటుగా దర్శకులు వాళ్లు కూడా తమ్ముళ్ల లాంటి వాళ్లే అంటూ చెప్పుకొచ్చారు. బి.వి.ఎస్ రవి, హరీష్ శంకర్, గోపీచంద్ వీళ్లు ఈవెంట్ కి వచ్చినందుకు థాంక్స్ అని అన్నారు. ఈ సినిమా టెక్నిషియన్స్ తమ బెస్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ మథి ప్రతి బ్లాక్ అందంగా వచ్చేలా చేశారు. రాం లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. రియల్ స్టోరీ రియల్ లొకేషన్స్ లో ఈ సినిమా చేశామని అన్నారు రవితేజ.

వంశీ కథ చెప్పినప్పుడే ఎగ్జైట్ అయ్యానని ఎప్పుడు మొదలు పెడదామా అని ఎదురుచూశానని అన్నారు. సినిమాకు అన్ని బాగా కుదిరాయని టైగర్ నాగేశ్వర రావు గట్టీఅ అలరిస్తుందని నమ్ముతున్నానని అన్నారు రవితేజ. సినిమాలో రేణు దేశాయ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఎంట్రీ ఇచ్చారు. ఆమెను తీసుకున్నందుకు వంశీని అభినందిస్తున్నా.. సినిమాకు డైలాగ్స్ రాసిన శ్రీకాంత్ విస్సా బాగా డైలాగ్స్ రాశాడు. సినిమాలోని డైలాగ్స్ ఎంజాయ్ చేస్తారని అన్నారు.

సినిమాలో అను కృతి ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. హీరోయిన్స్ గా నుపుర్, గాయత్రి వాళ్ల పాత్రల్లో బాగా చేశారు. ఇక అభిషేక్ అగర్వాల్ గురించి చెబుతూ అన్ కాంప్రమైజ్ ప్రొడ్యూసర్ ఆయన. ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే డిస్కషన్స్ ఉంటాయి. కానీ అభిషేక్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అంతెంత భారీగా ఉంటాడో ఈ సినిమా అంత భారీగా ఉంటుంది. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ కొట్టాలని అన్నారు. మళ్లీ మళ్లీ ఆయనతో సినిమా చేయాలని కోరుతున్నానని అన్నారు రవితేజ.

హీరో ఆఫ్ ది ఈవెనింగ్ జివి ఈ సినిమాకు మ్యూజిక్ బాగా ఇచ్చాడు. సాంగ్స్ రెస్పాన్స్ బాగుంది. నేను కూడా థియేటర్ లో జివి సౌండ్ ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నా అన్నారు. ఈ సినిమాకు గెటప్ హెయిర్ కాస్ట్యూం చూసిన రాజేష్ అతన్ని గైడ్ చేసిన వంశీ కి థాంక్స్ చెప్పారు.

నేను వంశీ గురించి రిలీజ్ తర్వాత మాట్లాడుతా.. తన నుంచి ఈ కన్విక్షన్ అసలు ఊహించలేదు. వంశీ గురించి రిలీజ్ తర్వాత గట్టిగా మాట్లాడుతా.. ఈ సినిమా 20న వస్తుంది. విపరీతంగా ఎంజాయ్ చేస్తారని అన్నారు రవితేజ. ఈ సినిమాతో పాటుగా బాలయ్య బాబు భగవంత్ కేసరి కూడా హిట్ అవ్వాలని.. విజయ్ లియో కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుతున్నా.. తమ్ముళ్లు థాంక్ యు సో మచ్ జై సినిమా అంటూ తన స్పీచ్ ముగించారు రవితేజ.