Begin typing your search above and press return to search.

టైగర్ కు ఇవే మైనస్ అయ్యాయి

అలాగే సినిమాలోని టైగర్ నాగేశ్వరరావు చేసే దొంగతనాలని ప్రొపెర్ గా ఎక్కడా చూపించలేదు. ట్రైన్ సీన్ కూడా గ్రాఫిక్స్ క్వాలిటీ లేకపోవడంతో తేలిపోయింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:35 AM GMT
టైగర్ కు ఇవే మైనస్ అయ్యాయి
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా పాజిటివ్ బజ్ తోనే థియేటర్స్ లోకి వచ్చిన రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఎవరేజ్ టాక్ వస్తోంది. హైఎక్స్ పెక్టేషన్స్ తో సినిమా చూడటానికి వెళ్ళిన ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు వంశీకృష్ణ ఫెయిల్ అయ్యాడనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడానికి మెయిన్ కారణం రియల్ లైఫ్ హీరో స్టొరీని సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చెప్పాలనుకోవడమే అని తెలుస్తోంది. జెంటిల్ మెన్ మూవీ ఫిక్షనల్ స్టొరీ కాబట్టి ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న చెల్లుతుంది. అలాగే ఆర్ఆర్ఆర్ కూడా కేవలం నిజ జీవిత పాత్రలని స్పూర్తిగా తీసుకుంటున్న అని జక్కన్న ముందే చెప్పారు.

అలాగే సినిమాలోని టైగర్ నాగేశ్వరరావు చేసే దొంగతనాలని ప్రొపెర్ గా ఎక్కడా చూపించలేదు. ట్రైన్ సీన్ కూడా గ్రాఫిక్స్ క్వాలిటీ లేకపోవడంతో తేలిపోయింది. అయితే కథని చెప్పడంలో దర్శకుడు విజువలైజేషన్ తక్కువగా చేసి నేరేషన్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు మిస్ అయ్యాయి. ఎమోషనల్ సీక్వెన్స్ కొంతలో బాగున్నాయి.

రవితేజ ఈ చిత్రంలో కాస్తా బెటర్ లుక్ లో కనిపించారంట. అలాగే డైలాగ్స్ కూడా బాగానే రాసుకున్నారు. టెక్నికల్ గా ప్రెజెంటేషన్ బాగుంది. కాని కథనాన్ని చెప్పడంలో దర్శకుడు ఎంచుకున్న ప్లాట్, తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ మూవీకి మైనస్ అయ్యాయని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న కామెంట్స్. నిడివి కూడా ఎక్కువగా ఉండటం వలన ఆడియన్స్ డిస్కనెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

ఎవరేజ్ టాక్ తో టైగర్ నాగేశ్వరరావు మూవీ థియేటర్స్ వద్ద ఎంత వరకు నిలబడుతుంది. ఈ వీకెండ్ ని ఎంత వరకు నిలబెట్టుకొని కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భగవంత్ కేసరి టాక్ బాగుండటంతో ఆడియన్స్ అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.