Begin typing your search above and press return to search.

రాజ‌మండ్రి బ్రిడ్జి ట్రైన్ సీన్ కి ఏడాదా?

మాస్ మ‌హారాజా క‌థానాయ‌కుడిగా 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' బ‌యోపిక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ పాత్ర‌లో మాస్ రాజా క‌నిపించ‌బోతున్నారు

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:47 AM GMT
రాజ‌మండ్రి బ్రిడ్జి ట్రైన్ సీన్ కి ఏడాదా?
X

మాస్ మ‌హారాజా క‌థానాయ‌కుడిగా 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' బ‌యోపిక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ పాత్ర‌లో మాస్ రాజా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచానా లు భారీగా పెంచేసాయి. మాస్ రాజా తొలిసారి బ‌యోపిక్ చేయ‌డంతో ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ క‌నిపిస్తుంది. టీఎన్ ఆర్ పాత్ర‌లో మాస్ రాజా ఎలా మెప్పించ‌బోతాడు? అన్న ఎగ్జైట్ మెంట్ క‌నిపిస్తుంది.

వాస్త‌వ క‌థ‌లో చాలా స‌వాళ్లే ఉండంతో ర‌వితేజ ట్రాన్స‌ప‌ర్మేష‌న్.. పెర్పార్మెన్స్ ఎలా ఉండ‌బోతుంది? అంటూ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే కొన్నిర‌కాల ఛేజింగ్ ల గురించి చిత్ర యూనిట్ రివీల్ చేసింది. తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ఛేజింగ్ ని చిత్ర ద‌ర్శ‌కుడు వంశీం పంచుకున్నారు. ఈ సినిమాలో మేకింగ్ ప‌రంగా స‌వాల్ విసిరిన స‌న్నివేశం ఏదంటే? రాజ‌మండ్రి బ్రిడ్జిసీన్ అన్నారు.

గోదావ‌రి బ్రిబ్జ్ ..దానిపై ట్రైన్ స‌న్నివేశాన్ని రీక్రియేట్ చేయ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. డీఓపీ..ఫైట్ మాస్ట‌ర్..ఆర్ట్ డిపార్ట్ మెంట్ అంద‌రూ నా విజ‌న్ కి త‌గ్గ‌ట్టు అద్బుతంగా ప‌నిచేసారు. నేను ఆ స‌న్నివేశం ఎలా ఉండాల‌నుకున్నానో? అలాగే నాకు ఔట్ ఫుట్ ఇచ్చారు. 20 సీక్వెన్స్ తీయ‌డానికి 20 రోజులు స‌మ‌యం ప‌ట్టింది. దాన్ని గ్రాఫిక్స్ వ‌ర్క్ పూర్తి చేయ‌డానికి ఏకంగా ఏడాది స‌మ‌యం ప‌ట్టింది.

ఆ సీన్ కోసం అంత‌గా ప‌నిచేయాల్సి వ‌చ్చింది. ఏడాదంతా ఓ టీమ్ దాన‌పై ప‌నిచేస్తే గానీ పూర్తి చేయ‌లేక‌పోయారు. అందులో అంత వాస్త‌వ‌క‌త క‌నిపిస్తుంది. చాలా నేచుర‌ల్ గా ఉంటుందా సీన్. రాజ‌మండ్రి బ్రిడ్జిపై ర‌న్నింగ్ ట్రైన్ ఎలా ఉంటుందో? అచ్చంగా సినిమాలో అదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. ఎక్క‌డా గ్రాపిక్స్ చేసిన‌ట్లు అనిపించ‌దు. విజువ‌ల్ గా ఆ సీన్ చాలా బాగుటుంది. సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది' అని అన్నారు. ఈపాన్ ఇండియా చిత్రం ద‌స‌రా కానుక‌గా ఈనెల 20న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.