Begin typing your search above and press return to search.

ప్రొడ్యూస‌ర్ మైండ్ బ్లాక్ చేసిన మాస్ రాజా

సీన్ కి రిస్క్ అవ‌స‌రం అనుకుంటే హీరోలు ఏమాత్రం ఆలోచించ‌డం లేదు. వెనకా.. ముందు ఆలోచించ కుండా రంగంలో దూకేస్తున్నారు

By:  Tupaki Desk   |   13 Oct 2023 11:10 AM GMT
ప్రొడ్యూస‌ర్ మైండ్ బ్లాక్ చేసిన మాస్ రాజా
X

సీన్ కి రిస్క్ అవ‌స‌రం అనుకుంటే హీరోలు ఏమాత్రం ఆలోచించ‌డం లేదు. వెనకా..ముందు ఆలోచించ కుండా రంగంలో దూకేస్తున్నారు. ఒక‌ప్ప‌టిలా డూప్ లు లేకుండా రియ‌ల్ హీరోలే యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం రిస్క్ లు ర‌స్క్ లా ఈజీగా తీసుకుంటున్నారు. చిన్న చిన్న గాయాలైనా ప‌ట్టించుకోకుండా ప‌ని చేస్తున్నారు. అయితే 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' కోసం మాస్ మ‌హారాజా అంత‌కు మించి సాహవాసం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆయ‌న క‌థానాయ‌కుడిగా వంశీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.' టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' జీవిత క‌థ ఆధారంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న క‌థ‌లో చాలా సాహ‌సోపేత మైన స‌న్నివేశాలే ఉన్నాయి. ఎత్తైన జైలు గోడ‌లు దూక‌డం.. ర‌న్నింగ్ ట్రైన్లు ఎక్క‌డం.. చెట్లపైనే అలు పెర‌గ‌కుండా న‌డ‌వడం వంటి చాలా ఇంట్రెస్టింగ్ విష‌యాలున్నాయి. ఇవ‌న్నీ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో హైలైట్ చేస్తున్నారు.

అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈసంద‌ర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ సినిమా కోసం ర‌వితేజ గా ఎంత‌గా శ్ర‌మించారో చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. ఆయ‌న ఎఫెర్ట్ చూసి నిర్మాత షాక్ కి గురైన‌ట్లు తెలిపారు.' ఇందులో ట్రైన్ దోపిడీ సీన్ ఒక‌టుంటుంది. ట్రైన్ మీది నుంచి లోపలికి దూకే షాట్‌లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డారు. మోకాలి కిపై బ‌ల‌మైన గాయం తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించాం.

ఆపరేషన్ చేసి 12 కుట్లు వేసారు. ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఆ షాట్‌లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి షూటింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని భావించిన రవితేజ రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయారట. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా వినలేదు. సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావానికి అది నిదర్శ‌నం. ఆయ‌న స్థాయికి అంత రిస్క్ అవ‌స‌రం లేదు. కానీ తీసుకుని సినిమా కోసం ప‌నిచేసారు' అని అన్నారు. దీంతో ర‌వితేజ అభిమా నులు మాస్ రాజాతో అట్లుంట‌ది అంటున్నారు. అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.