Begin typing your search above and press return to search.

టైగర్ నాగేశ్వరరావు.. డేంజరస్ జయవాని

అందులో చీరకట్టులో ఆమె ఒక వాంప్ షేడ్స్ తో కనిపిస్తోంది. అయితే ఇందులో ఆమె చేసేది వేశ్యపాత్రనా అనే అనుమానం కలుగుతుంది

By:  Tupaki Desk   |   29 Sep 2023 11:22 AM GMT
టైగర్ నాగేశ్వరరావు.. డేంజరస్ జయవాని
X

మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా సందర్భంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రవితేజ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరపైకి రాబోతున్న ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు. అంతేకాకుండా ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.


ఇక సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు ఎలాంటి పాత్రలలో కనిపించబోతున్నారు అనే విషయాలను కూడా చిత్ర యూనిట్ పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు గా నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడు.

ఈ సినిమా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా రూపొందింది. దర్శకుడు వంశీ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే దాదాపు నాలుగేళ్ల వరకు వర్క్ చేశాడు. ఇక రవితేజ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో నుపుర్ సనోన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరొక ముఖ్యమైన పాత్రలో తమిళ నటి అనుకృతి వాస్ కనిపించబోతోంది. జయవాని అనే ఆమె పాత్రకు సంబంధించిన ఒక పోస్టర్ను కూడా రీసెంట్ విడుదల చేశారు.

అందులో చీరకట్టులో ఆమె ఒక వాంప్ షేడ్స్ తో కనిపిస్తోంది. అయితే ఇందులో ఆమె చేసేది వేశ్యపాత్రనా అనే అనుమానం కలుగుతుంది. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఒక వేశ్య ద్వారానే కీలక మలుపు తిరుగుతుంది. అలాగే అతను మరణించడానికి కారణం కూడా ఒక వేశ్యనే అనే అంటారు. బహుశా ఆ పాత్రలో అనుకృతి నటిస్తోంది అని అనిపిస్తోంది.

ఇక ఈ అమ్మాయి వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల అనుకృతి 2018 మిస్ ఇండియాగా కూడా కిరీటాన్ని అందుకుంది. గత ఏడాది ఆమె డిఎస్పి అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అందులో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఇక తెలుగులో కూడా అవకాశాలు అందుకోవాలని చూస్తున్న సమయంలో ఆమెకు ఇప్పుడు ఒక డేంజరస్ క్యారెక్టర్ అయితే దొరికింది. టైగర్ నాగేశ్వరరావు జీవితంలో డేంజర్ గా పిలవబడే ఆ మహిళ పాత్రను ఆమె ఏ విధంగా హైలెట్ చేస్తుందో చూడాలి. ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20వ తేదీన విడుదల కాబోతోంది.