Begin typing your search above and press return to search.

మాస్ రాజా దమ్ దమ్ చేసేందుకు రెడీ..!

ధమాకా వాల్తేరు వీరయ్య రెండు హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న రవితేజ ఆ తర్వాత వచ్చిన రావణాసుర సినిమాతో నిరాశ పరచాడు

By:  Tupaki Desk   |   1 Sep 2023 6:17 AM GMT
మాస్ రాజా దమ్ దమ్ చేసేందుకు రెడీ..!
X

ధమాకా వాల్తేరు వీరయ్య రెండు హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న రవితేజ ఆ తర్వాత వచ్చిన రావణాసుర సినిమాతో నిరాశ పరచాడు. ఈ సినిమా విషయంలో రవితేజ అంచనాలు తప్పాయి. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన రావణాసుర సినిమా తో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు రవితేజ. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ క్రేజ్ వచ్చేలా చేసింది.


రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెల 5న రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ సాంగ్ గా ఏక్ దమ్ ఏక్ దమ్ అనే మాస్ సాంగ్ రాబోతుంది. రవితేజ సినిమాల్లో సాంగ్స్ కూడా మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తాయి. తన ప్రతి ఆల్బంలో అలాంటి సాంగ్స్ ఉండేలా చూసుకుంటాడు రవితేజ. ఈ క్రమంలో టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కూడా ఏక్ ధం ఏక్ ధం అంటూ మంచి రెట్రో రొమాంటిక్ సాంగ్ తో వస్తున్నారు.

ఏక్ ధం ఏక్ ధం సాంగ్ రిలీజ్ పోస్టర్ లో రవితేజ మాస్ లుక్ అదిరిపోయింది. హీరోయిన్ ని టీజ్ చేస్తూ రవితేజ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. రిలీజైన పోస్టర్ లో నుపుర్ సనన్ థై షో అదిరింది. సో టైగర్ నాగేశ్వర రావు నిజమైన రూమర్స్ తో రూపొందిస్తున్న సినిమాగా స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వర రావు కథతో వస్తుందని తెలుస్తుంది. సినిమా టీజర్ మేకింగ్ స్టామినా తెలియచేయగా సాంగ్ పోస్టర్ ఆడియన్స్ ని లాక్ అయ్యేలా చేస్తుంది.

దసరా బరిలో దిగుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై బజ్ ఓ రేంజ్ లో ఉంది. సినిమాతో రవితేజ స్టామినా పాన్ ఇండియా లెవ్ల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యారు. రవితేజ కూడా ఈ సినిమా మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ ఈగల్ సినిమా చేస్తున్నాడు. అది కూడా 2024 సంక్రాంతికి వస్తుంది. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉంటుందని తెలిసిందే. వాళ్లిద్దరు కలిసి ఆడియన్స్ కి మరో క్రాక్ ఇచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.