Begin typing your search above and press return to search.

టైగర్ కోసం ఎప్పుడు లేనంత కష్టం!

ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయని స్థాయిలో టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం రవితేజ ప్రమోషన్స్ చేస్తూ ఉండటం విశేషం.

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:30 AM GMT
టైగర్ కోసం ఎప్పుడు లేనంత కష్టం!
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి సిద్ధమవుతోన్న మూవీ టైగర్ నాగేశ్వరరావు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా దీనిని ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ స్టార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. రవితేజ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో మూవీకి మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకొని గట్టిగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయని స్థాయిలో టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం రవితేజ ప్రమోషన్స్ చేస్తూ ఉండటం విశేషం.

టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో భాగంగా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లకి కామెంటేటర్ గా కూడా రవితేజ మారిపోయారు. తెలుగు హీరోలలో ఇలా క్రికెట్ మ్యాచ్ లలో ప్రమోషన్స్ చేసిన మొదటి స్టార్ గా రవితేజ నిలిచారు. నార్త్ ఇండియాలో కూడా సినిమాని గట్టిగా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో అభిషేక్ 'అగర్వాల్ పిక్చర్స్ సూపర్ హిట్ కొట్టారు.

ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో మరో సూపర్ సక్సెస్ ని పాన్ ఇండియా స్థాయిలో అందుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ కోసం నిర్మాతలు కూడా కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. హీరోయిన్స్ కూడా ప్రమోషన్స్ కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మెజారిటీ బాద్యత అంతా రవితేజ తీసుకుంటున్నారు.ప్రమోషన్స్ లో భాగంగా ఇండియాలో అతిపెద్ద రియాలిటీ షో ఇండియన్ గాట్ టాలెంట్ షోలో రవితేజ పాల్గొన్నారు. దీనికి సంబందించిన ఎపిసోడ్ త్వరలో ప్రారంభం కానుదంట

సినిమాపై ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ ఉంది. దసరా బరిలో రెండు పెద్ద సినిమాలతో పోటీ పడుతున్న టైగర్ నాగేశ్వరరావు ఎలాంటి రిజల్ట్ అందిస్తుందనేది వేచి చూడాలి. ఈ మూవీ సూపర్ హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా లెవల్ లో రవితేజ పేరు గట్టిగా వినిపించే అవకాశం ఉంది.