Begin typing your search above and press return to search.

బాద్‌షా, మాస్ రాజాని కలిపే ప్రయత్నం...!

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది

By:  Tupaki Desk   |   14 Oct 2023 8:03 AM GMT
బాద్‌షా, మాస్ రాజాని కలిపే ప్రయత్నం...!
X

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. దసరా కానుకగా వచ్చే వారంలో విడుదల అవ్వబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు పాన్ ఇండియా రేంజ్‌ లో సాగుతున్నాయి. తెలుగు లో మాత్రమే కాకుండా అయిదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కు అక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు వంశీ టైగర్ నాగేశ్వరరావు సినిమా హిందీ వర్షన్‌ ప్రమోషన్‌ కోసం ముంబై వెళ్లాడు. అక్కడ హిందీ మీడియాతో మాట్లాడుతూ టైగర్‌ నాగేశ్వరరావు గురించి మాట్లాడాడు. అదే సమయంలో తనకు రవితేజ మరియు షారుఖ్ ఖాన్‌ లతో ఒక మల్టీ స్టారర్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

హాలీవుడ్‌ మూవీ బ్యాడ్‌ బాయ్స్‌ తరహాలో షారుఖ్‌ మరియు రవితేజలను నెగటివ్‌ షేడ్స్ లో చూపించాలని తాను ఆశిస్తున్నట్లుగా దర్శకుడు వంశీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరిద్దరిని హీరోలుగా సినిమా చేస్తానంటే సాధారణ విషయం... కానీ ఇద్దరిని కూడా నెగటివ్‌ షేడ్స్ లో చూపించాలని అనుకోవడం దర్శకుడి వంశీ ఘట్స్ కి హ్యాట్సాప్‌ అనాల్సిందే.

చేసింది రెండు సినిమాలే.. అవి కూడా చిన్న సినిమాలే అయినా కూడా టైగర్‌ నాగేశ్వరరావు వంటి భారీ చిత్రాన్ని చేసే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయం. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న టైగర్‌ నాగేశ్వరరావు కనుక సూపర్‌ హిట్‌ అయితే వంశీ కోరుకున్నట్లుగా షారుఖ్‌, రవితేజల బ్యాడ్ బాయ్స్‌ వర్కౌట్‌ అయ్యేందుకు ఛాన్స్ ఉంది.