Begin typing your search above and press return to search.

పడి లేచిన టైగర్​.. పుంజుకుంటున్న వసూళ్లు!

టాలీవుడ్ సీనియర్​ హీరో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కథ మారింది. ఈ సినిమా వసూళ్లు స్టడీగా నమోదవుతున్నాయి

By:  Tupaki Desk   |   26 Oct 2023 9:05 AM GMT
పడి లేచిన టైగర్​.. పుంజుకుంటున్న వసూళ్లు!
X

టాలీవుడ్ సీనియర్​ హీరో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కథ మారింది. ఈ సినిమా వసూళ్లు స్టడీగా నమోదవుతున్నాయి. సినిమాకు క్రమక్రమంగా రెస్పాన్స్​ పెరుగుతోంది. ఓ వైపు భగవంత్ సేకరి బ్లాక్​ బాస్టర్​ టాక్​తో దూసుకుపోతున్నప్పటికీ.. టైగర్​ను చూసేందుకు కూడా ఆడియెన్స్ ఆశించిన దాన్ని కన్నా ఎక్కువగానే​ వస్తున్నారు.

వివరాళ్లోకి వెళితే.. వంశీ దర్శకత్వంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. స్టువర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపించి అద్భుతంగా నటించారు.

అయితే రవితేజ నటన ఆకట్టుకున్నప్పటికీ.. కథ కథనాలు మాత్రం ఆడియెన్స్​ను మొదట అంతగా మెప్పించలేకపోయాయి. అదీగాక ఈ సినిమాకు 3 గంటల రన్ టైమ్​ బాగా మైనస్ అయ్యింది. అది సినిమా ఫలితంపై గట్టిగా దెబ్బ కొట్టింది. దీంతో ఈ సినిమాకు నష్ట నివారణ చర్యలు కూడా చేశారు మేకర్స్​. సినిమాను 3 గంటల నుంచి 20 నిమిషాల రన్ టైమ్​ను ట్రిమ్ చేసి.. 2 గంటల 37 నిమిషాలకు కుదించారు.

సినిమాను ట్రిమ్ చేయడం ప్లస్​ అయింది. రెస్పాన్స్ క్రమక్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో వసూళ్లు కూడా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. పైగా లియో ఇక్కడ కాస్త డౌన్ అయిపోవడంతో టైగర్ ప్రేక్షకులకు సెకండ్ ఆప్షన్‌గా మారింది. ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ అభిమానులు, మాస్ ప్రేక్షకులు సినిమాను బానే చూస్తున్నట్లు తెలుస్తోంది. కథ క్రీస్పీగా ఉందంటూ, థియేటర్లో సినిమాను బాగా​ ఎంజాయ్​ చేస్తున్నారు.

దసరా తర్వాతి రోజు సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరి ఇక పెరిగిన కలెక్షన్స్​తో ఇప్పుడీ సినిమా ఎంత వరకు సేవ్ అవుతుందో చూడాలి.. ఇకపోతే సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, నుపుర్‌ సనన్‌, రేణు దేశాయ్‌, జిషుసేన్‌ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్‌, నాజర్‌ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు.