Begin typing your search above and press return to search.

మీ బ్రోమాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నాం బ్రో!

సినిమా విజ‌యం సాధిస్తే ఆనంద‌మే వేరుగా. అందులోనూ చాలా ప‌రాజ‌యాలు ఎదురైన త‌ర్వాత విజ‌యం వ‌రించిందంటే రెట్టింపు ఉత్సాహం తో సంద‌డి చేస్తుంటాం

By:  Tupaki Desk   |   18 Nov 2023 11:48 AM GMT
మీ బ్రోమాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నాం బ్రో!
X

సినిమా విజ‌యం సాధిస్తే ఆనంద‌మే వేరుగా. అందులోనూ చాలా ప‌రాజ‌యాలు ఎదురైన త‌ర్వాత విజ‌యం వ‌రించిందంటే రెట్టింపు ఉత్సాహం తో సంద‌డి చేస్తుంటాం. తాజాగా స‌ల్మాన్ ఖాన్ అదే ప‌నిలో ఉన్నాడు. ఇటీవ‌లే ఆయ‌న క‌థానాయకుడిగా తెర‌కెక్కిన 'టైగ‌ర్ -3' దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిదే. తొలి రోజు భారీగానే ఓపెనింగ్స్ సాధించింది. కానీ సినిమాపై మిక్స్ డు టాక్ వ‌చ్చింది.

దీంతో వ‌సూళ్లు ఎలా ఉంటాయి? అన్న సందేహం తెర‌పైకి వ‌చ్చింది. వంద కోట్లైనా తెస్తుందా? అన్న డౌడ్ వ్య‌క్తం అయింది. కానీ అంత‌కు మించి అని టైగ‌ర్ -3 బాక్సాపీస్ వ‌ద్ద స‌త్తాచాటుతుంది. ఆరు రోజుల్లోనే చిత్రం 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. స్టిల్ ఇంకా వ‌సూళ్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో యూనిట్ ముంబైలో విజ‌యోత్స‌వం షురూ చేసింది. నిన్న‌టి రోజున ముంబైలో స‌క్సెస్ మీట్ సెలబ్రేట్ చేసారు.

ఈ సంద‌ర్భంగా వేడుక‌కు స‌ల్మాన్ ఖాన్..క‌త్రినాకైఫ్..ఇమ్రాన్ హష్మీ స‌హా టీమ్ అంతా హాజ‌రైంది. వీరంతా క‌లిసి వేదిక‌పై సినిమా పాట‌ల‌కు డాన్సు చేసి అల‌రించారు. ఇక స‌ల్మాన్ ఆనందానికైతే అవ‌దుల్లేవ్. చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన విజ‌యం కావ‌డంతో అంద‌రికంటే ఎక్కువ ఉత్సాహ‌న్ని చూపించాడు. ఈ సంద‌ర్భంగా స్టేజ్ పైనే బ్రోమాన్స్ ని చూపించాడు. ఇమ్రాన్ హ‌ష్మీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అత‌డికి ముద్దులు పెట్టేసాడు.

దీంతో జ‌నాలంతా ఒక్క‌సారిగా ప‌డి ప‌డి న‌వ్వారు. ముద్దు స‌న్నివేశాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఇమ్రాన్ హ‌ష్మీనే భాయ్ ముద్దుల్లో ముంచేసాడు. ఈ సంద‌ర్భంగా హ‌ష్మీ గురించి మాట్లాడుతూ..'నేను ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. కానీ ఇమ్రాన్ కి అది బాగా అల‌వాటు. దాన్ని మిస్ అవుతున్నాడేమో. అందుకే ముద్దులిచ్చి ఆ లోటు తీర్చేసాను' అన్నారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. బ్రోమాన్స్ ని త‌ట్టుకోలేక‌పోతున్నా బ్రో అంటూ కామెంట్లు షురూ చేసారు.