Begin typing your search above and press return to search.

టైగర్ 3.. కత్తిలాంటి లేడీ స్పై..

యష్ రాజ్ ఫిలిమ్స్ లో తెరకెక్కిన ఏక్ ది టైగర్, టైగర్ జిందా హై సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Oct 2023 9:31 AM GMT
టైగర్ 3.. కత్తిలాంటి లేడీ స్పై..
X

యష్ రాజ్ ఫిలిమ్స్ లో తెరకెక్కిన ఏక్ ది టైగర్, టైగర్ జిందా హై సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ లాభాలు ఆర్జించిపెట్టాయి. యష్ రాజ్ ఈ సిరీస్ ని కొనసాగిస్తూ ఉంది. అందలో భాగంగా పార్ట్ 3 ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.


యష్ రాజ్ ఫిలిమ్స్ కి ఈ స్పై కథలు భారీగా లాభాలు తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇప్పుడు టైగర్ 3 మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. టైగర్ సిరీస్ లో మూడో భాగంగా ఈ చిత్రం సిద్ధం అవుతోంది. దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లేడీ స్పై కత్రికా కైఫ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బ్లాక్ షూట్ లో రోప్ పట్టుకొని గన్ తో కాలుస్తున్నట్లు చూపించారు. ఈ క్యారెక్టర్ కూడా మూవీలో చాలా ఇంటెన్స్ గా ఉండబోతోందని పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమా ట్రైలర్ ని అక్టోబర్ 13న తెలుగు, తమిళ్, హిందీ భాషలలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

టైగర్ సిరీస్ లో రాబోయే ఈ చిత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ కి ఈ ఏడాది మరో వెయ్యి కోట్లు తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే మాట బిటౌన్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో జనాలు కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండే హై వోల్టేజ్ కథలని ఇష్టపడుతున్నారు. అలాగే టైగర్ సిరీస్ లో భాగంగా ముందు వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

సల్మాన్ ఖాన్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాలలో టైగర్ సిరీస్ ఉన్నాయి. దీంతో టైగర్ 3పైన కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి దీపావళి బరిలో ఈ చిత్రం ఏ మేరకు బ్లాస్ట్ అవుతుందనేది వేచి చూడాలి.