Begin typing your search above and press return to search.

టైగర్ 3: థియేటర్స్ పేల్చేస్తారా ఏంటి?

నార్త్ స్టేట్ లోని ఒక థియేటర్లో అందరూ ప్రశాంతంగా సినిమా చూస్తుండగా సడన్గా కొందరు ఫ్యాన్స్ దీపావళి షాట్స్ పేల్చారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 6:01 AM GMT
టైగర్ 3: థియేటర్స్ పేల్చేస్తారా ఏంటి?
X

సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా ఇటీవల గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ఊహించిన విధంగా కాస్త నెగిటివ్ టాక్ కూడా వైరల్ అవుతుంది. ఈసారి సల్మాన్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేరు అని ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చాలా నిరుత్సాహ పరిచాయి అని కూడా ఫాన్స్ అయితే కొందరు అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్పెషల్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోలేదు అని, ఇక జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు అని ఆశించిన ఫ్యాన్స్ కు కూడా నిరాశే ఎదురైంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ మల్టీ వర్స్ సినిమాగా టైగర్ 3 తెరపైకి తీసుకువచ్చారు. కానీ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అయితే భవిష్యత్తులో రాబోయే సినిమాలపై కూడా హైప్ పెంచలేకపోయింది.

అయితే కొన్ని మాస్ ఏరియాలలో మాత్రం టైగర్ 3 ని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక కొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ అతి ఆనందం థియేటర్ ఓనర్స్ ను కంగారు పెట్టింది. అలాగే థియేటర్స్ ఉన్న మిగతా జనాలు కూడా ప్రారంభయంతో బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నార్త్ స్టేట్ లోని ఒక థియేటర్లో అందరూ ప్రశాంతంగా సినిమా చూస్తుండగా సడన్గా కొందరు ఫ్యాన్స్ దీపావళి షాట్స్ పేల్చారు. దీంతో అవి పైకి తాకి మళ్లీ కిందే పడిపోయాయి. ఇక కొన్ని సెకన్లలో థియేటర్ మొత్తం కూడా షాట్స్ పేలుతూ కనిపించాయి. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా అందరు పడి బయటకు పరుగులు తీశారు. వెంటనే దియేటర్ యాజమాన్యం రంగంలోకి దిగినప్పటికీ అప్పటికే జరగాల్సిన కొంత నష్టమైతే జరిగిపోయింది.

మొన్నటి వరకు సౌత్ ఇండియాలో ఇలాంటి పరిణామాలు కనిపించేవి. కానీ ఇప్పుడు హిందీ ఫ్యాన్స్ కూడా ఈ తరహాలో మితిమీరిన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం మాత్రం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసికుంటున్నా కూడా ఆలోచన చేయకుండా ఫ్యాన్స్ ఈ తరహా అత్యుత్సాహం ప్రాణబయన్ని కలిగిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.