Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్ తో ఛాన్స్ కొట్టేసిన టైగర్ ష్రాఫ్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్ గ్యారంటీ!

టైగర్ ష్రాఫ్ నటించిన భాఘి 4 మూవీ(Bhagi-4 Movie) ఈమధ్యనే షూటింగ్ పూర్తయింది.ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది.

By:  Tupaki Desk   |   2 Aug 2025 4:00 PM IST
స్టార్ డైరెక్టర్ తో ఛాన్స్ కొట్టేసిన టైగర్ ష్రాఫ్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్ గ్యారంటీ!
X

బాలీవుడ్ లో పేరున్న హీరోలలో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)కూడా ఒకరు. ఒకప్పుడు ఈయన అద్భుతమైన సినిమాలు తీసి సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా టైగర్ ష్రాఫ్ చేసిన సినిమాలు ఫ్లాప్స్ అవ్వడంతో ఈయన మార్కెట్ ఇండస్ట్రీలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి టైగర్స్ ష్రాఫ్ తాజాగా ఓ కన్నడ దర్శకుడికి డేట్స్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? టైగర్ ష్రాఫ్ సౌత్ డైరెక్టర్ పై ఎందుకు నమ్మకం పెట్టుకున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..

టైగర్ ష్రాఫ్ నటించిన భాఘి 4 మూవీ(Bhagi-4 Movie) ఈమధ్యనే షూటింగ్ పూర్తయింది.ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. అయితే ఒక సినిమా కంప్లీట్ అవ్వగానే మరో కొత్త సినిమాని ప్రకటించారు టైగర్ ష్రాఫ్. ఇన్ని రోజులు బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకున్న టైగర్ ష్రాఫ్.. తాజాగా ఓ కన్నడ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రొడ్యూసర్ మురాద్ ఖేతానితో కలిసి టైగర్ ష్రాఫ్ ఒక హై కాన్సెప్ట్ యాక్షన్ సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్టు జాతీయ మీడియా ఛానల్స్ చెబుతున్నాయి.

అయితే ఈ హై యాక్షన్ కాన్సెప్ట్ సినిమాకి దర్శకుడిగా 'అవనే శ్రీమన్నారాయణ' (Avane Srimannarayana) మూవీ ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి సచిన్ రవి చేస్తున్నట్టు తెలుస్తోంది. సచిన్ రవి చెప్పిన కథ టైగర్ ష్రాఫ్ కి చాలా నచ్చేసిందట. స్టోరీ మీద నమ్మకం పెట్టుకున్న టైగర్ ష్రాఫ్ ఈ సినిమాకి ఓకే చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం అక్టోబర్లో 45 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టు కూడా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ యాక్షన్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.. అక్టోబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరున్న యాక్షన్ బృందాన్ని ఈ ప్రాజెక్టు కోసం రంగంలోకి దింపబోతున్నారట. అంతేకాదు వచ్చే ఏడాది తెరపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. అసలే సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న టైగర్ ష్రాఫ్ కి.. ఒకవేళ కన్నడ డైరెక్టర్ తో చేస్తున్న సినిమా కనుక వర్క్ అవుట్ అయితే ఇక ఆయన కెరియర్ లో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పవచ్చు.

ఈ మధ్యనే భాఘి-4 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ మెహతా (Raj Mehta) దర్శకత్వంలో రివేంజ్ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమా లగ్ జా గేల్ (Lag Jaa Gale) లో కూడా నటిస్తున్నారు.ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , లక్ష్య లల్వానీలు హీరోయిన్లుగా .. కరణ్ జోహార్ (Karan Johar)నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.