Begin typing your search above and press return to search.

టైర్ 2 లో హయ్యెస్ట్ రికార్డులివే..

టాలీవుడ్ లో హీరోల జాబితాని టైర్ 1, టైర్ 2గా డివైడ్ చేసి చూస్తారు. స్టార్ హీరోలు అందరూ టైర్ 1 జాబితాలోకి వస్తారు

By:  Tupaki Desk   |   13 May 2024 4:04 AM GMT
టైర్ 2 లో హయ్యెస్ట్ రికార్డులివే..
X

టాలీవుడ్ లో హీరోల జాబితాని టైర్ 1, టైర్ 2గా డివైడ్ చేసి చూస్తారు. స్టార్ హీరోలు అందరూ టైర్ 1 జాబితాలోకి వస్తారు. టైర్ 2లోకి 50 నుంచి 100 కోట్ల మధ్యలో తమ సినిమాల ద్వారా కలెక్షన్స్ సాధించగలిగే హీరోలు వస్తారు. టాలీవుడ్ లో టైర్ 2 హీరోలు అంటే విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజ్ రవితేజ, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, నితిన్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలు అందరూ వస్తారు. తాజాగా ఈ జాబితాలోకి సిద్దు జొన్నలగడ్డ కూడా చేరడం విశేషం.

టిల్లు స్క్వేర్ మూవీతో 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకొని రికార్డ్ విజయాన్ని సిద్దు అందుకున్నాడు. ఈ కారణంగా ఈ యంగ్ హీరో టైర్ 2 జాబితాలోకి వచ్చాడు. అలాగే హనుమాన్ మూవీతో 300 కోట్లు కలెక్ట్ చేసిన తేజ సజ్జా కూడా ఇప్పుడు టైర్ 2 హీరోల జాబితాలోకి వచ్చాడు. టైర్ 2 హీరోల పేరుమీద ఉన్న హైయెస్ట్ రికార్డులు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

విజయ్ దేవరకొండ గీతాగోవిందం మూవీ వరల్డ్ వైడ్ గా 70 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. టైర్ 2 హీరోల చిత్రాలలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ గా ఉంది. ఏపీలో కూడా గీతాగోవిందం మూవీ 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ రికార్డ్ సృష్టించింది. నైజాంలో టైర్ 2 హీరోలలో కింగ్ గా సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీతో నిలిచాడు.

ఈ సినిమా 26.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో టైర్ 2 హీరోలలో హైయెస్ట్ షేర్ టిల్లు స్క్వేర్ మీద ఉంది. ఈ సినిమాకి ఓవర్సీస్ లో 15 కోట్ల షేర్ రావడం విశేషం. తమిళంలో డబ్బింగ్ ద్వారా అత్యధిక షేర్ కలెక్ట్ చేసిన టైర్ 2 హీరో మూవీ అంటే ఖుషి అని చెప్పాలి. ఈ సినిమా కోలీవుడ్ లో 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం.

కర్ణాటకలో హైయెస్ట్ షేర్ వసూళ్లు చేసిన టైర్ 2 హీరో విజయ్ దేవరకొండ గీతాగోవిందం సినిమాకి కన్నడనాట 6 కోట్ల షేర్ వచ్చింది. కన్నడంలో స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అయితే గీతాగోవిందం మూవీకి కన్నడ నాట అపూర్వ ఆదరణ లభించడం విశేషం. ఈ రికార్డులని టైర్ 2 హీరోలు ఈ రెండు, మూడేళ్ళలో బ్రేక్ చేయడం గ్యారెంటీ అనే మాట టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది.