Begin typing your search above and press return to search.

టైర్ 2 హీరోల డిమాండ్ బాగుంది..!

టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ హంగామా చేస్తున్నారు

By:  Tupaki Desk   |   7 March 2024 6:30 PM GMT
టైర్ 2 హీరోల డిమాండ్ బాగుంది..!
X

టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ హంగామా చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్, పుష్ప 2 తో అల్లు అర్జున్, RRR తో రాం చరణ్, ఎన్.టి.ఆర్ వీళ్లంతా ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకోగా వారు నెక్స్ట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. వీరితో పాటు కొత్తగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ కూడా జాయిన్ అవుతున్నారు. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో రాబోతుంది. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈసారి రాజమౌళి టార్గెట్ చాలా పెద్దగా పెట్టుకున్నాడని తెలుస్తుంది. RRR తో పాటకి ఆస్కార్ తెచ్చిన జక్కన్న ఈసారి మహేష్ సినిమాతో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇలా టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు.. నేషనల్ వైడ్ ఆడియన్స్ ని మెప్పించే కథలతో వస్తుంటే. వారు కాదన్న కథలు.. వారితో చేయలేక పక్కన పెట్టిన కథలు టైర్ 2 హీరోల దగ్గరకు వస్తున్నాయి.

స్టార్ తో సినిమా అంటే దాదాపు 200 నుంచి 300 కోట్ల బడ్జెట్.. పాన్ వరల్డ్ రిలీజ్ అంటూ పెద్ద హంగామా నడుస్తుంది. అయితే 50 నుంచి 70 కోట్ల బడ్జెట్ తో చేసే సినిమాలు తక్కువ అయ్యాయి. టైర్ 2 హీరోలు ఆ ఛాన్స్ అందుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలే 100 కోట్ల లోపు పూర్తి చేసే వారు. కానీ ఇప్పుడు వారి రేంజ్ పెరిగింది కాబట్టి బడ్జెట్ రేటు పెరిగింది. అందుకే వారి కోసం రాసుకున్న కథలు కాస్త టైర్ 2, మీడియం రేంజ్ హీరోల దగ్గరకు వస్తున్నాయి.

రీసెంట్ గా ఒక స్టార్ హీరో ఇమేజ్ కి తగిన కథ ఒక డైరెక్టర్ చెబితే పాన్ ఇండియా అప్పీల్ లేదని రిజెక్ట్ చేశాడట. అదే కథ మీడియం రేంజ్ హీరోకి చెప్పి ఒప్పించారని టాక్. ప్రస్తుతం ఆ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే ఆ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. స్టార్ హీరోల కథలు వారు కాదనేసరికి ఆ నెక్స్ట్ స్టేజ్ లో ఉన్న హీరోల దగ్గరకు వస్తున్నాయి. సో ఈ లెక్కన చూస్తే టైర్ 2 హీరోల డిమాండ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. వారు కూడా సినిమాకు ఇదివరకు 5 నుచి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వారు. ఇప్పుడు పెరిగిన డిమాండ్ మేరకు 20, 25 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడుగుతున్నారని తెలుస్తుంది.