Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు సీక్వెల్ గానే మణిరత్నం సినిమా?

ఇప్పుడు కమల్ హాసన్తో మణిరత్నం సినిమా తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చివరిగా నాయకుడు మూవీ వచ్చింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:31 AM GMT
ఆ సినిమాకు సీక్వెల్ గానే మణిరత్నం సినిమా?
X

సౌత్ ఇండియాలో లెజెండరీ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి మణిరత్నం. పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో పాన్ ఇండియా లెవల్ లో మణిరత్నం తనని తాను మరోసారి గ్రాండ్ గా షోకేస్ చేసుకున్నారు. ఇప్పుడు కమల్ హాసన్తో మణిరత్నం సినిమా తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చివరిగా నాయకుడు మూవీ వచ్చింది.

మళ్ళీ 35 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాని కమల్ హాసన్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ తో పాటు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై మణిరత్నం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మూవీ టైటిల్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు.

యాక్షన్ సీక్వెన్స్ తో కమల్ హాసన్ ని డిఫరెంట్ గెటప్ లో ఆవిష్కరిస్తూ మణిరత్నం ప్రెజెంట్ చేసిన థగ్ లైఫ్ టైటిల్ ఇంట్రో విజువల్ అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి. అలాగే ఈ వీడియోలో కమల్ హాసన్ డైలాగ్స్ తోనే అతని పాత్రని కూడా పరిచయం చేశారు. రంగరాయ శక్తివేల్ నాయకన్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు. ఈ పేరు ఉండటంతో ఈ సినిమా నాయకుడుకి సీక్వెల్ అనే ప్రచారం తెరపైకి వచ్చింది.

నాయకుడు మూవీలో వేలు నాయకర్ పాత్రలో కమల్ హాసన్ నటించారు. అతని మనవాడి పేరు శక్తివేల్ నాయకర్. ఇప్పుడు థగ్ లైఫ్ లో హీరో పేరు కూడా అదే కావడంతో మణిరత్నం నాయకుడు సీక్వెల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వేలు నాయకర్ మనవాడి కథని ఇలా థగ్ లైఫ్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని బలంగా నమ్ముతున్నారు. అయితే మణిరత్నం నుంచి గాని లేదంటే చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు.

కాని ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ గ్యారెంటీగా నాయకుడు సీక్వెల్ అని భావిస్తున్నారు. ఒక వేళ సీక్వెల్ అయితే మాత్రం థగ్ లైఫ్ మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ లోకి వెళ్లిపోతాయనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అలాగే కమల్ హాసన్ కెరియర్ లో కూడా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధం కాబోతోంది.