Begin typing your search above and press return to search.

వారు జారడంతో ఆ భారీ మూవీ వెయిట్‌ తగ్గింది..!

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందిన ఇండియన్ 2 సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది

By:  Tupaki Desk   |   24 March 2024 5:55 AM GMT
వారు జారడంతో ఆ భారీ మూవీ వెయిట్‌ తగ్గింది..!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందిన ఇండియన్ 2 సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఇండియన్ 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు కమల్‌ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు థగ్‌ లైఫ్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందుతున్న థగ్‌ లైఫ్‌ సినిమా పై విపరీతమైన బజ్ క్రియేట్‌ అయ్యింది. మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్ సల్మాన్‌ మరియు తమిళ స్టార్ నటుడు జయం రవి ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ ప్రకటన రావడంతో సినిమా వెయిట్‌ పెరిగింది.

ఇటీవలే కొన్ని కారణాల వల్ల దుల్కర్ సల్మాన్‌ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు జయం రవి కూడా థగ్ లైఫ్ సినిమా నుంచి తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా తప్పుకోవడం తో సినిమా వెయిట్‌ తగ్గిందని తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాతో ఫామ్‌ లోకి వచ్చాడు. అంతే కాకుండా మణిరత్నం తన గత చిత్రం పొన్నియిన్‌ సెల్వంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాంటిది వీరిద్దరి కాంబోలో థగ్ లైఫ్‌ వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి పడింది. కానీ ఇప్పుడు దుల్కర్ మరియు జయం రవి తప్పుకోవడంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన కొందరిలో కనిపిస్తుంది.