Begin typing your search above and press return to search.

థగ్ లైఫ్.. అప్పుడే ఓ మరక?

హాలీవుడ్ కి మూవీ రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమాలో హీరో క్యారెక్టర్ అచ్చంగా థగ్ లైఫ్ లో కమల్ హాసన్ తరహాలోనే ఉంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 9:52 AM GMT
థగ్ లైఫ్.. అప్పుడే ఓ మరక?
X

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ థగ్ లైఫ్. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, మణిరత్నం నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇంట్రోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.


డిఫరెంట్ గెటప్ లో ఈ వీడియోలో కమల్ హాసన్ కనిపించడంతో పాటు మూవీలో తన పాత్రని కూడా పరిచయం చేశారు. దీంతో 35 ఏళ్ళ క్రితం మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు మూవీకి ఈ చిత్రం సీక్వెల్ అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ టాక్ నడుస్తూ ఉండగానే ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీకి థగ్స్ లైఫ్ కాపీ అంటూ ట్రోలింగ్ మొదలైంది.

కోలీవుడ్ కి చెందిన క్రిటిక్ ముందుగా ఈ కంపారిజన్ ఫోటో షేర్ చేశారు. హాలీవుడ్ కి మూవీ రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమాలో హీరో క్యారెక్టర్ అచ్చంగా థగ్ లైఫ్ లో కమల్ హాసన్ తరహాలోనే ఉంది. అలాగే ఆ సినిమా విజువల్ బ్యాక్ డ్రాప్ కూడా అలానే ఉండటంతో రెండింటిలో ఒకే విధంగా ఉండటం విశేషం. ఈ ఫొటోస్ కంపారిజన్ చూసిన తర్వాత మణిరత్నం కూడా హాలీవుడ్ సినిమాలు కాపీ చేస్తాడా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

రెండు సినిమాలకి కథ పరంగా క్యారెక్టరైజేషన్ పరంగా రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుందని, కేవలం కొన్ని పిక్స్ చూసి కాపీ అంటూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదని కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, స్కై వాకర్ మ్యూజిక్ కి చాలా వ్యత్యాసం ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

ఓ వైపు నాయకుడు మూవీకి సీక్వెల్ అంటూ మరో వైపు హాలీవుడ్ సినిమాకి కాపీ అంటూ థగ్ లైఫ్ సినిమాపై జరుగుతోన్న ప్రచారానికి చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేది వేచి చూడాలి. ఒక వేళ ఆ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో మణిరత్నం థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారా అనే క్వశ్చన్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.