Begin typing your search above and press return to search.

థగ్ లైఫ్ ఓటీటీ డీల్.. అందరికీ గుణపాఠమేనా?

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Jun 2025 11:00 AM IST
థగ్ లైఫ్ ఓటీటీ డీల్.. అందరికీ గుణపాఠమేనా?
X

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ నాయకుడు మూవీ తర్వాత వారి కాంబో రిపీట్ అవ్వడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మంచి విజయం సాధిస్తుందని ఆడియన్స్, అభిమానులు అంచనా వేశారు.

కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్స్ రివర్స్ అయింది. మూవీ డిజాస్టర్ గా మారింది. బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు మిగిల్చింది. ఆ షాక్ లో ఉన్న థగ్ లైఫ్ టీమ్ కు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కూడా ఇప్పుడు షాక్ ఇచ్చింది. దాదాపు రూ.130 కోట్లకు పైగా వెచ్చించి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఇప్పటికే టాక్ వినిపించింది.

అయితే సినిమా రిజల్ట్ చూసి పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ ఒప్పందం గురించి నెట్‌ ఫ్లిక్స్ ఇప్పుడు చర్చలు జరుపుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కనీసం 25 శాతం మొత్తాన్ని లేదా.. రూ.30 కోట్లను తగ్గిస్తేనే తాము స్ట్రీమింగ్ చేస్తామని తేల్చి చెప్పిందట.

అలా నెట్ ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాత కమల్ హాసన్, సహ నిర్మాత మణిరత్నంకు భారీ నష్టం జరగనుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. థగ్ లైఫ్ ఓటీటీ పాఠం.. అందరికీ వర్తిస్తుందని, నిర్మాతలు జాగ్రత్త పడాల్సిందేనని నెటిజన్లు సూచిస్తున్నారు.

ఎందుకంటే కొంతకాలంగా భారీ బడ్జెట్ మూవీలకు ఓటీటీలు.. ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. థియేటర్స్ లో రిలీజ్ కు ముందే.. నిర్మాణ ఖర్చుల్లో ఎక్కువ శాతాన్ని ఓటీటీ డీల్స్ నుంచి పొందుతున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలకు అలా మరింత ఎక్కువగా జరుగుతోంది. రీసెంట్ గా పుష్ప-2 విషయంలో అదే జరిగిందని టాక్.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యాక.. డీల్స్ గురించి మళ్లీ ఓటీటీలు చర్చలు చేపడుతున్నాయి. ఇప్పుడు థగ్ లైఫ్ విషయంలో అదే జరగ్గా.. టాలీవుడ్ మేకర్స్ ఇకపై జాగ్రత్తపడాలని చెబుతున్నారు. ఎక్కువ బడ్జెట్ పెట్టి.. ఓటీటీల నుంచి పొందొచ్చనే ధీమా మానుకోవాలని అంటున్నారు.