థగ్ లైఫ్ రోల్స్ పై త్రిష గుట్టు రట్టు!
సినిమాలో ప్రతీ పాత్ర గ్రే షేడ్ తో ఉంటుంది. తెరపై చాలా పాత్రలు కొత్తగా కనిపిస్తాయి. గతంలో ఫలానా సినిమాలో చూసామే అన్న భావన ఎక్కడా కలగదు.
By: Tupaki Desk | 25 May 2025 9:00 PM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ -మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన 'థగ్ లైఫ్' భారీ అంచనాల మద్య జూన్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కు చేరాయి. 'నాయకుడు' తర్వాత ఇద్దరు చేతులు కలపడానికి మూడు దశాబ్దాలు పట్టింది. ఈ నేపథ్యంలో మణిరత్నం సరికొత్త కమల్ హాసన్ ని తెరపై ఆవిష్కరిస్తాడని అంతా ఎదురు చూస్తున్నారు.
రిలీజ్ కౌంట్ డౌన్ కూడా మొదలైంది. మరో పది రోజుల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో కమల్ పాత్ర ఎలా ఉండబోతుందని ఒకటే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై లో జరిగిన ఈవెంట్ తో ఆ బజ్ పీక్స్ కు చేరుకుంది. సినిమాలో చాలా పాత్రలున్నాయి. ఇందులో కమల్ కి జోడీగా త్రిష నటిస్తుంది. ఈ సందర్బంగా త్రిష సినిమాలో పాత్రల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సినిమాలో ప్రతీ పాత్ర గ్రే షేడ్ తో ఉంటుంది. తెరపై చాలా పాత్రలు కొత్తగా కనిపిస్తాయి. గతంలో ఫలానా సినిమాలో చూసామే అన్న భావన ఎక్కడా కలగదు. ఆద్యంతం కొత్తగా అనిపిస్తుంది. అంత బలంగా పాత్ర లను రాసారని తెలిపింది. ఇందులో త్రిష గాయని పాత్రలో కనిపించనుంది. పేరుకే గాయని త్రిష పాత్రలో నెగిటివ్ కోణం కూడా ఉంటుందని ఇప్పటికే లీకైంది. కమల్ పాత్రకు ధీటుగా ఆమె రోల్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.
ప్రస్తుతం త్రిష తెలుగులోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'విశ్వంభర'లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సూర్య 45వ చిత్రంలోనూ నటిస్తోంది. మాలీవుడ్ లో రామ్ అనే చిత్రంలోనూ నటిస్తుంది. ఇవన్నీ ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. త్రిష నటించిన సినిమాలు ఇన్ని ఒకేసారి రిలీజ్ అవ్వడం విశేషం.
