Begin typing your search above and press return to search.

షుగర్ బేబీ.. ‘థగ్ లైఫ్’ నుంచి మరో క్రేజీ సాంగ్

కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రూపొందుతున్న ‘థగ్ లైఫ్’ సినిమా టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   21 May 2025 6:08 PM IST
షుగర్ బేబీ.. ‘థగ్ లైఫ్’ నుంచి మరో క్రేజీ సాంగ్
X

కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రూపొందుతున్న ‘థగ్ లైఫ్’ సినిమా టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. జూన్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సింబు, త్రిష, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్, పోస్టర్‌లు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి.

‘థగ్ లైఫ్’ టీమ్ నాన్‌స్టాప్ ప్రమోషన్స్‌తో సినిమా హైప్‌ను రెట్టింపు చేస్తోంది. మే 24న గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది, ఇది అభిమానులకు పండగలా ఉండనుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌తో అందరినీ ఆకర్షించిన మేకర్స్, ఇప్పుడు రెండో సింగిల్ ‘షుగర్ బేబీ’ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూత్‌ఫుల్ బీట్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

తాజాగా రిలీజైన ‘షుగర్ బేబీ’ సాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట, ఆయన ట్రేడ్‌మార్క్ మ్యాజిక్‌తో స్లో బీట్ లో మత్తెక్కించేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఈ పాటను ఆలపించగా, అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ఈ సాంగ్‌కు మరింత ఆకర్షణను జోడించింది. ఈ పాట రొమాంటిక్, ఎనర్జిటిక్ వైబ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘థగ్ లైఫ్’ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ. 63 కోట్లకు అమ్ముడై, కోలీవుడ్‌లో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఓవర్సీస్‌లో 18 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా భారీ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. పాజిటివ్ రివ్యూస్ వస్తే ఈ టార్గెట్ సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో భారీ ధరలకు అమ్ముడైన ఈ సినిమా, ‘విక్రమ్’ కలెక్షన్స్‌ను అధిగమించాల్సి ఉంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్‌లోనూ భారీ స్క్రీన్ కౌంట్‌తో విడుదల కానుంది. అలాగే ఐమ్యాక్స్ వెర్షన్‌తో ఈ సినిమా విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. ఇక జూన్ 5న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.