కమల్ 'థగ్ లైఫ్'.. బీభత్సమైన లాభాలా?
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ హక్కులను రూ. 130 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. శాటిలైట్ ఒప్పందం రూ. 60 కోట్లకు ముగిసిందని వినికిడి.
By: Tupaki Desk | 4 Jun 2025 8:31 PM ISTప్రముఖ నటుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో ఇప్పుడు థగ్ లైఫ్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. నాయకన్ (1987) లాంటి హిట్ తర్వాత కమల్, మణిరత్నం మరోసారి ఇప్పుడు చేతులు కలిపారు. గ్యాంగ్ స్టర్, యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా థగ్ లైఫ్ ను గ్రాండ్ గా మణిరత్నం తెరకెక్కించారు.
త్రిష, అభిరామి ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, పంకజ్ త్రిపాఠి, గౌతమ్ కార్తీక్, నాజర్ తదితరులు యాక్ట్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాణీలు కట్టారు. కమల్ హాసన్, మణిరత్నం నిర్మాతలుగా వ్యవహరించారు.
అయితే ఇప్పటికే థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి కమల్, మణిరత్నం కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ నుంచి హైప్ ఏర్పడింది. దానిని మేకర్స్ ఓ రేంజ్ లో పెంచేశారు. వరుసగా అప్డేట్స్ తో సందడి చేశారు. దీంతో అటు కమల్ అభిమానులు.. ఇటు సినీ ప్రియులు.. థగ్ లైఫ్ సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు.
మరికొద్ది గంటల్లో కన్నడ తప్ప అన్ని భాషల్లో రిలీజ్ కానున్న థగ్ లైఫ్ కోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేశారు. పెద్ద ఎత్తున బడ్జెట్ తో సినిమాను రూపొందించారని వినికిడి. మొత్తం ప్రమోషన్స్ ఖర్చుతో కలిపి బడ్జెట్ రూ.200 కోట్లు అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటికే నాన్ థియేట్రికల్ డీల్స్ ఖరారు అయ్యాయని టాక్.
వాటి ద్వారానే నిర్మాతలు మొత్తం ఇన్వెస్ట్మెంట్ ను తిరిగి పొందారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ హక్కులను రూ. 130 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. శాటిలైట్ ఒప్పందం రూ. 60 కోట్లకు ముగిసిందని వినికిడి. మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.20 కోట్లు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
అలా మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.210 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే. ఇక థియేటర్ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అదనమే. మూవీకి పాజిటివ్ మౌత్ టాక్ వస్తే వసూళ్ల వర్షం కురుస్తుంది. దీంతో థగ్ లైఫ్ ద్వారా కమల్ హాసన్, మణిరత్నం భారీ లాభాలను ఆర్జిస్తారని క్లియర్ గా తెలుస్తుంది. మరేం జరుగుతుందో.. ఎలాంటి వసూళ్లు వస్తాయో వేచి చూడాలి.
