Begin typing your search above and press return to search.

కమల్ థగ్ లైగ్ జింగుచా మోత మోగిందోచ్..!

కమల్ హాసన్, శింభు, త్రిష సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. థగ్ లైఫ్ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2025 7:55 PM IST
కమల్ థగ్ లైగ్ జింగుచా మోత మోగిందోచ్..!
X

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లీడ్ రోల్ లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలంస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ జింగుచాని రిలీజ్ చేశారు. థగ్ లైఫ్ సినిమాలోని ఫస్ట్ సాంగ్ పెళ్లి వేడుకలో మోతమోగించేలా వచ్చింది.

మణిరత్నం, రెహమాన్ కాంబో సినిమా అంటేనే మ్యూజికల్ గా సినిమా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. ఇక కమల్ హాసన్ కూడా తోడవడంతో ఈ ఆల్బం పై మరింత క్రేజ్ ఏర్పడింది. థగ్ లైఫ్ తొలి సాంగ్ జింగుచా ఇలా రిలీజ్ అవ్వడమే ఆలస్యం అలా వైరల్ గా మారింది. ఈ సాంగ్ కి కమల్ హాసన్ లిరిక్స్ అందించడం విశేషం. ఇక ఈ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో థగ్ లైఫ్ మెయిన్ కాస్టింగ్ అంతా పాల్గొన్నారు.

కమల్ హాసన్, శింభు, త్రిష సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. థగ్ లైఫ్ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో జూన్ 5న థగ్ లైఫ్ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. థగ్ లైఫ్ ఆడియో రైట్స్ ను సారెగామా భారీ రేటుకి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. థగ్ లైఫ్ ఈవెంట్ ని ఆస్ట్రేలియాలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మే 23న సిడ్నీలో రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్ జరగబోతుంది. అందులో థగ్ లైఫ్ మ్యూజిక్ ఫెస్ట్ కూడా జరుగుతుందని తెలుస్తుంది.

కమల్ థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రచార చిత్రాలు ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పాటు చేశాయి. ఇక సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమాగా థగ్ లైఫ్ మీద భారీ క్రేజ్ ఏర్పడింది. పొన్నియిన్ సెల్వన్ సినిమా తర్వాత మణిరత్నం చేస్తున్న సినిమాగా థగ్ లైఫ్ మీద నేషనల్ లెవెల్ లో భారీ హైప్ ఉంది. విక్రం తో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న కమల్ హాసన్ థగ్ లైఫ్ తో మరోసారి అదరగొట్టాలని చూస్తున్నారు.