థగ్ లైఫ్ ఓవర్సీస్ టార్గెట్.. తేడా వస్తే దెబ్బ మామూలుగా ఉండదు!
లెజెండరీ నటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం దశాబ్దాల తర్వాత 'థగ్ లైఫ్' కోసం మళ్లీ కలిసారు, ఈ కాంబో అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 22 May 2025 2:00 AM ISTలెజెండరీ నటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం దశాబ్దాల తర్వాత 'థగ్ లైఫ్' కోసం మళ్లీ కలిసారు, ఈ కాంబో అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. జూన్ 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా తమిళ సర్కిల్స్‌తో పాటు తెలుగు, మలయాళ ఆడియన్స్‌లోనూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకర్షిస్తోంది.
‘థగ్ లైఫ్’ సినిమా పోస్టర్లు, ప్రోమోలు ఇప్పటికే ఆడియన్స్‌ను ఫిదా చేశాయి. కమల్ హాసన్ ఒక వృద్ధ గ్యాంగ్‌స్టర్‌గా, సింబు ఆయన శిష్యుడిగా కనిపించనున్న ఈ సినిమా కథ గురు-శిష్యుల సంబంధం నుంచి రైవలరీ వైపు మలుపు తిరుగుతుందని ట్రైలర్ సూచిస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ కాంబోకు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో భారీ డీల్స్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఏకంగా రూ. 63 కోట్లకు అమ్ముడై, కోలీవుడ్‌లో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 మిలియన్ డాలర్లుగా సెట్టయ్యింది, ఇది ఖచ్చితంగా భారీ లక్ష్యమే. తమిళ సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ మార్కెట్ ఉంది, గతంలో 'లియో', 'జైలర్', 'పొన్నియిన్ సెల్వన్ 1', '2.0' సినిమాలు 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించాయి. 'థగ్ లైఫ్' కూడా ఈ క్లబ్‌లో చేరితే బ్రేక్ ఈవెన్ సాధించడం సాధ్యమే, కానీ అందుకు పాజిటివ్ రివ్యూస్ కీలకం కానున్నాయి.
సినిమా ఓవర్సీస్ టార్గెట్‌ను అందుకోకపోతే దెబ్బ మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఓవర్సీస్‌తో పాటు అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా భారీ ధరలకు అమ్ముడైంది. ఇండియాలో కూడా ఈ సినిమా కమల్ హాసన్ గత చిత్రం ‘విక్రమ్’ కలెక్షన్స్ (రూ. 400 కోట్లు)ను అధిగమించాల్సి ఉంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళలోనూ ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు సింబు, త్రిష, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా టెక్నికల్‌గా బలంగా ఉంది. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. మరి బిగ్ స్క్రీన్ పై ఈ కంటెంట్ ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.
