Begin typing your search above and press return to search.

థ్రిల్లర్ కథల జోరు… సక్సెస్ కి కేరాఫ్

ఆద్యంతం ఉత్కంటభరితంగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కూర్చొని కథనాన్ని ఆశ్వాదిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:21 PM GMT
థ్రిల్లర్ కథల జోరు… సక్సెస్ కి కేరాఫ్
X

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో థ్రిల్లర్ జోనర్ మూవీల హవా నడుస్తోంది. వాటికి డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు హర్రర్ కామెడీ జోనర్ ఎలా అయితే ట్రెండ్ క్రియేట్ చేసిందో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలకి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఆద్యంతం ఉత్కంటభరితంగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కూర్చొని కథనాన్ని ఆశ్వాదిస్తున్నారు.

కాంతారా మూవీ డబ్బింగ్ సినిమాగా వచ్చిన స్ట్రైట్ తెలుగు సినిమా స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యి భారీ లాభాలు తీసుకొచ్చింది. తరువాత సాయి తేజ్ విరూపాక్ష మూవీ కూడా ఒక ఊరి నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. నిర్మాతకి భారీ లాభాలు తీసుకొచ్చింది. రీసెంట్ గా వచ్చిన మా ఊరి పొలిమేర మూవీ కూడా సూపర్ హిట్ కొట్టింది.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో, ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ తో దర్శకులు కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం కూడా అదిరిపోయే ట్విస్ట్ లు, ఎగ్జైట్ చేసే సన్నివేశాలతో ఆద్యంతం మెప్పించింది. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ ని ఈ సినిమా రాబట్టింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత మరోసారి పాయల్ రాజ్ పుత్ తో అజయ్ భూపతి సూపర్ హిట్ కొట్టాడనే మాట వినిపిస్తోంది.

ఇలా వరుసగా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ హిట్ అవుతున్నాయి. ఒటీటీలో కూడా ప్రేక్షకులు అలాంటి కంటెంట్ లు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇతర భాషలకి సంబందించిన తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్, విరూపాక్ష సీక్వెల్, మా ఊరిపొలిమేరకి కొనసాగింపు, మంగళవారం సినిమాకి నెక్స్ట్ పార్ట్ ప్లానింగ్ జరుగుతోంది.

ఇప్పటికే కాంతారా 2 మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతోంది. విరూపాక్ష కథ కూడా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మిగిలిన వాటికిపైన దర్శకులు కసరత్తు చేస్తున్నారు. ఈ జోనర్ కి డిమాండ్ పెరగడంతో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ కథలతో వచ్చే అవకాశం ఉంది.