Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్ యంగ్ హీరో..!

టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్ పెళ్లి పీటలు ఎక్కాడు. తెలుగు, తమిళంలో చాలా సినిమాలు చేసిన త్రిగుణ్ ఇప్పుడు ఓ ఇంటివాడు అయ్యాడు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 2:00 PM GMT
పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్ యంగ్ హీరో..!
X

టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్ పెళ్లి పీటలు ఎక్కాడు. తెలుగు, తమిళంలో చాలా సినిమాలు చేసిన త్రిగుణ్ ఇప్పుడు ఓ ఇంటివాడు అయ్యాడు. ఆయన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తమిళనాడుకు చెందిన నివేదితను ఆయన పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా అవినాషి పట్టణంలోని శ్రీ సెంథూర్ మహల్‌లో వీరి వివాహం జరిగింది.


పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఆయన ఫరెవర్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇద్దరూ సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. కాగా, వీరి పెళ్లి కి పలువురు టాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. తేజస్విని మదివాడ, ఆదర్శ్ లాంటివారు హాజరై సందడి చేశారు. వీరి పెళ్లి ఫోటోలను తేజశ్వి మదివాడ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం

త్రిగుణ్ అసలు పేరు అదిత్ ఈశ్వరన్. చెన్నై కుర్రాడు. కానీ తన అరంగేట్రం మాత్రం తెలుగులోనే జరిగింది. జెనీలియా తో కలిసి కథ అనే మూవీలో నటించాడు. అదే అతని మొదటి సినిమా. కొంచెం హీరో రామ్ కి దగ్గరి పోలికలతో ఉంటాడు. కాగా, ఆ మూవీ తర్వాత పీఎస్‌వీ గరుడ వేగ', 'మనసుకు నచ్చింది', '24 కిసెస్', 'డియర్ మేఘ', 'WWW', 'కథ కంచికి మనం ఇంటికి' వంటి సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్లు కాకపోయినా, పర్వాలేదనిపించాయి. ఈ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.

తెలుగులో వచ్చి హిట్ అయిన హ్యాపీ డేస్ సినిమాతో తమిళంలోనూ తన కెరీర్ మొదలుపెట్టాడు. ఇటు తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాగా, అతను కిందటి సంవత్సరమే తన పేరును త్రిగుణ్ గా మార్చుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా అనే సినిమాలు చేశాడు. ప్రస్తుతం అవసరానికో అబద్దం అనే సినిమా చేస్తున్నాడు.

హీరోగా నిలదొక్కునేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చూడాలి మరి అతని కెరీర్ భవిష్యత్తులో ఎలా మారుతుందో. ఇదిలా ఉండగా, త్రిగుణ్ కొద్ది నెలల క్రితమే తన తల్లి కోల్పోయాడు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు.