Begin typing your search above and press return to search.

మ్యూజిక్ లెజెండ్ బ‌యోపిక్ లో ముగ్గురు స్టార్లా?

చాలా మంది న‌టీన‌టుల‌తో ఎన్టీఆర్ కి అనుబంధం ఉండ‌టంతో ఆ స్టార్లు అంతా భాగం కావాల్సి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:44 AM GMT
మ్యూజిక్ లెజెండ్ బ‌యోపిక్ లో ముగ్గురు స్టార్లా?
X

ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల బ‌యోపిక్ లు అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా మంది స్టార్లు ఉండ‌టానికి అవ‌కాశం ఉంటుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఎంత మంది స్టార్లు న‌టించారో తెలిసిందే. చాలా మంది న‌టీన‌టుల‌తో ఎన్టీఆర్ కి అనుబంధం ఉండ‌టంతో ఆ స్టార్లు అంతా భాగం కావాల్సి వ‌చ్చింది. అంత పెద్ద స్టార్లు దిగ‌క‌పోతే అలాంటి బ‌యోపిక్ ల‌కు సార్ద‌క‌థ కూడా ఉండ‌దు.


తాజాగా త‌మిళ సంగీత దిగ్గ‌జం ఇళ‌యారాజ జీవిత క‌థ‌న కూడా తెర‌కెక్కడానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ధ‌నుష్ ....ఇళ‌య‌రాజా పాత్ర పోషిస్తున్నాడు. కోలీవుడ్ లో ఎంతో మంది నటులు ..సీనియ‌ర్లు ఉన్నా ధ‌నుష్ అయితేనే బాగుంటుంద‌ని.. మ్యూజిక్ మ్యాస్ట్రో పాత్ర‌లో అత‌ను అయితేనే ఒదిగిపోతాడ‌ని ఏరికోరి మ‌రి ధ‌నుష్ ని తెర‌పైకి తెచ్చారు. తాజాగా ఈ లెజెండ‌రీ జీవిత క‌థ‌లో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్..సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా భాగ‌మ‌వుతున్నారుట‌.

ఇద్ద‌రు గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారుట‌. వాస్త‌వానికి ఆ రెండు పాత్ర‌ల్లో ఎలాంటి న‌టీన‌టులు న‌టించినా ఇబ్బంది లేక‌పోయినా స్టార్లు అయితే బాగుంటుంద‌ని...ఇళయరాజికి గౌర‌వ‌ప్ర‌దంగా ఉంటుంద‌ని ఈ సీనియర్ల‌ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది. ఇళ‌య‌రాజాతో ర‌జనీ..క‌మ‌ల్ హాస‌న్ సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌యోపిక్ లో న‌టించండ‌ని ఆ ఇద్ద‌ర్నీ ఎవ‌రూ అడ‌గాల్సిన ప‌నిలేదు.

వారే న‌టిస్తామంటూ స్వ‌చ్ఛందంగా వ‌స్తారు. ముగ్గురి మ‌ధ్య అంత సాన్నిహిత్యం ఉంది. దీంతో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ మ‌రింత క‌ళాత్మ‌కంగా మారింద‌ని చెప్పొచ్చు. పెద్ద స్టార్లు యాడ్ అయితే ఆ సినిమాకి రీచ్ అలాగే ఉంటుంది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క‌న్ప‌మ్ కాలేదు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు బాల్కీ పేరు వినిపింది. అలాగే మారి సెల్వ‌రాజ్ కూడా తెర‌పైకి వ‌చ్చాడు. కానీ ఇద్ద‌రిలో ఎవ‌రు అన్న‌ది ఇంకా క‌న్ప‌మ్ కాలేదు.