Begin typing your search above and press return to search.

ముగ్గురు `ప్ర‌శాంత్‌`ల‌ను మున‌గ చెట్టెక్కించారు!

డిజిట‌ల్ మాధ్య‌మం ఒక `కోతి` లాంటిది! ఇక్క‌డ ఎవ‌రిని అయినా ఓ ఆట ఆడుకుంటారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 6:36 PM GMT
ముగ్గురు `ప్ర‌శాంత్‌`ల‌ను మున‌గ చెట్టెక్కించారు!
X

డిజిట‌ల్ మాధ్య‌మం ఒక `కోతి` లాంటిది! ఇక్క‌డ ఎవ‌రిని అయినా ఓ ఆట ఆడుకుంటారు. సోష‌ల్ మీడియా యుగంలో కాదేదీ `మీమ్ ఫెస్ట్‌`క‌న‌ర్హం అన్న చందంగా మారింది ప‌రిస్థితి. ఇప్ప‌టికిప్పుడు ముగ్గురు `ప్ర‌శాంత్‌`లను ఒక చోట చేర్చుతూ మీమ్ ఫెస్ట్ ఆస‌క్తిని క‌లిగించింది.


ఇందులో ఒక ప్ర‌శాంత్ .. కేజీఎఫ్- స‌లార్ చిత్రాల‌తో ట్రెండింగ్ లో ఉన్న ప్ర‌శాంత్ కాగా, మ‌రో ప్ర‌శాంత్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌. ఇంకో ప్ర‌శాంత్ ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 7 విజేత ప‌ల్ల‌వి ప్రశాంత్. ఆ ముగ్గురు బొమ్మ‌ల్ని ఒక ఫోటోఫ్రేమ్ లోకి తెచ్చి హాస్య బ్ర‌హ్మీ ఫోటో వేసి మ‌రీ మీమ్ క్రియేట్ చేసేశారు. ఇత‌ని పేరు ప్రశాంత్ మొన్న ఫేమ‌స్.. ఇత‌ని పేరు ప్ర‌శాంత్ నిన్న ఫేమ‌స్.. ఈయ‌న‌ పేరు కూడా ప్ర‌శాంత్ .. ఇవాళ ఫేమ‌స్! అంటూ కామెడీ చేస్తున్నారు.

వ‌రుస ఘ‌ట‌న‌లు, ప్ర‌జ‌ల్లో ట్రెండింగ్ గా మారాయి. స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ రావ‌డంతో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పేరు గూగుల్ లో ట్రెండింగ్ గా మారింది. యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమాతో అత‌డు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఇక రెండో ప్ర‌శాంత్ రాజ‌కీయ వ్యూహాలు ర‌చిస్తారు. గ‌తంలో వైకాపా ఏపీలో అధికారంలో రావ‌డానికి స‌హ‌క‌రించిన ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ అధినేత‌ల‌ను క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈసారి ఎన్నిక‌ల్లో బాబుతో క‌లిసి ప‌ని చేస్తార‌నేది టాక్. మూడవ ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత. పల్లవి ప్రశాంత్ హౌస్ విజేత‌గానే కాదు, అన్న‌పూర్ణ స్టూడియో వెలుప‌ల ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌కుడై అరెస్ట‌వ్వ‌డంతో సంచ‌ల‌నంగా మారాడు. ప్ర‌స్తుతం బెయిల్ పై బ‌య‌టే ఉన్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ముగ్గురు ప్ర‌శాంత్‌ల‌ను మీమ్ ఫెస్ట్ తో మున‌గ‌చెట్టెక్కిస్తున్నారు.