Begin typing your search above and press return to search.

2024: పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ముగ్గురు అగ్ర హీరోలు

ఎంత పెద్ద హీరోలైన ఒక్కోసమయంలో ఫెయిల్యూర్స్ తప్పవు. వరుస ఫ్లాప్ లు సొంతం చేసుకున్న సందర్భాలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:41 AM GMT
2024: పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ముగ్గురు అగ్ర హీరోలు
X

ఎంత పెద్ద హీరోలైన ఒక్కోసమయంలో ఫెయిల్యూర్స్ తప్పవు. వరుస ఫ్లాప్ లు సొంతం చేసుకున్న సందర్భాలు ఉంటాయి. అయితే వారికి మరల ఒక్క సక్సెస్ పడితే బౌన్స్ బ్యాక్ అయిపోతారు. ఫ్లాప్ లతో ఇమేజ్ కి పెద్ద ఇబ్బంది లేకపోయిన మార్కెట్ మాత్రం డౌన్ అవుతూ ఉంటుంది. అలాగే ముగ్గురు స్టార్ హీరోలు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈ ఏడాది సూపర్ సక్సెస్ లతో కమ్ బ్యాక్ అయ్యారు.

వారిలో ముందుగా రజినీకాంత్ గురించి చెప్పుకోవాలి. సూపర్ స్టార్ రజిని చివరిగా 2.ఓ మూవీతో హిట్ కొట్టారు. ఆ మూవీ తర్వాత అరడజను సినిమాలు చేశారు. వాటిలో ఏవీ ఆడియన్స్ ని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. కాలా, కబాలి సినిమాలు తమిళ్ ఆడియన్స్ కి కొంత వరకు నచ్చిన సూపర్ స్టార్ రేంజ్ మూవీస్ కాదని తేల్చేశారు. అయితే ఈ ఏడాది జైలర్ తో రజిని బ్లాక్ బస్టర్ కొట్టారు.

ఈ మూవీ ఏకంగా 600 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని కోలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో రజినీకాంత్ కమ్ బ్యాక్ అయ్యి ఇప్పుడు లోకేష్ కనగరాజ్, జై భీమ్ ఫేం జ్ఞాన్ వేల్ తో మూవీస్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు 2024లో రిలీజ్ కానున్నాయి. యంగ్ రెబల్ స్టార్ కి చివరిగా బాహుబలి 2తో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.

దీని తర్వాత మూడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేశారు. అందులో సాహో మాత్రమే బ్రేక్ ఈవెన్ అందుకుంది. మిగిలిన రెండు డిజాస్టర్ అయ్యాయి. ఇండియన్ వైడ్ గా క్రేజ్ ఉన్న ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ లో ఆ సినిమాలు లేవు. ఇప్పుడు సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు. ఈ రేంజ్ లో ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని దర్శక, నిర్మాతలకి కూడా క్లారిటీ వచ్చేలా చేశారు. ప్రభాస్ కి సలార్ మూవీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మూడేళ్ళ క్రితం చివరిగా జీరో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అందుకున్నారు.

ఆ తరువాత ఏవో కారణాల వలన సినిమాలకి గ్యాప్ ఇచ్చి మరల ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వాటిలో పఠాన్, సలార్ సినిమాలు వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసి మరోసారి బాక్సాఫీస్ బాద్ షా షారుక్ అని ప్రూవ్ చేశాయి. డంకీ మూవీ కమర్షియల్ గా భారీ సక్సెస్ కాకపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే మూవీ అనే టాక్ తెచ్చుకుంది. ఇలా ముగ్గురు స్టార్ హీరోలకి ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో సూపర్ కమ్ బ్యాక్ దొరికింది. ఈ క్రేజ్, స్పీడ్ ని వీళ్ళు ఇకపై ఎలా ముందుకి తీసుకొని వెళ్తారు అనేది వేచి చూడాలి.