Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్లాక్‌ లో ముగ్గురు ముద్దుగుమ్మలు

అయితే ఒకే ఫ్రేమ్‌ లో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉండటం, వారు ముగ్గురు కూడా గ్లామర్‌ తో పిచ్చెక్కించేలా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 7:33 AM GMT
పిక్ టాక్ : బ్లాక్‌ లో ముగ్గురు ముద్దుగుమ్మలు
X

సోషల్‌ మీడియాలో హీరోయిన్స్ ఫోటో షూట్స్ కి కొదవ లేదు. అందాలు ఆరబోస్తూ ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్ అందాలు చూపిస్తూ షేర్ చేసే ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. అయితే ఒకే ఫ్రేమ్‌ లో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉండటం, వారు ముగ్గురు కూడా గ్లామర్‌ తో పిచ్చెక్కించేలా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది.


తాజాగా ప్రముఖ మ్యాగజైన్ కోసం బాలీవుడ్‌ స్టార్ ముద్దుగుమ్మలు టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ లు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించారు. ముగ్గురు కూడా బ్లాక్ డ్రెస్ లో అందంగా చిరు నవ్వులు చిందిస్తూ ఫోటో షూట్‌ కి ఫోజ్ ఇచ్చారు.

ముగ్గురు ముద్దుగుమ్మలు సింగిల్ ఫ్రేమ్ లో ఉండటం తో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ రేంజ్ గ్లామర్‌ పిక్ ను ఈ మధ్య కాలంలో చూడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు కన్నుల విందు అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ ఫోటో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ పై తెగ సందడి చేస్తున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలో టబు మరియు కరీనా కపూర్ ఖాన్‌ లు సీనియర్ హీరోయిన్స్‌. వీరి కెరీర్ ప్రారంభం అయ్యి రెండు దశాబ్దాలు దాటినా కూడా ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక కృతి సనన్‌ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌ గా నిలిచింది.