Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7లో ఆ ఇద్దరూ..?

ఈ సీజన్ లో కూడా జబర్దస్త్ కి చెందిన ఇద్దరు సందడి చేయనున్నారట. వారెవరో కాదు, నరేష్, రంగస్థలం మహేష్.

By:  Tupaki Desk   |   16 Aug 2023 7:10 AM GMT
బిగ్ బాస్ 7లో ఆ ఇద్దరూ..?
X

ప్రముఖ టీవీ రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాల్టీ షోలో కేవలం ఫేమ్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. వారందరికీ ఒకే గదిలో ఉంచి, వారికి కొన్ని టాస్కులు ఇచ్చి, వారిని ఆడిస్తారు. ఇప్పటి వరకు తెలుగులో ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. మధ్యలో ఒక ఓటీటీ కూడా వచ్చింది. ఇప్పుడు ఏడో సీజన్ కోసం సర్వం సిద్ధమైంది.

సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ప్రతి సీజన్ లో సీజన్ మొదలవ్వకముందే, కొన్ని పేర్లు వినపడుతూ ఉంటాయి. అంతేకాదు, ఈ షోకి వచ్చేవారు ఒక్కొక్కరు ఒక్కో రంగం నుంచి నేర్పరులై ఉంటారు. ముఖ్యంగా జబర్దస్త్ నుంచి ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అంతకముందు ముక్కు అవినాష్, చలాకీ చంటి, గత సీజన్ ఫైమా వచ్చారు.

కాగా, ఈ సీజన్ లో కూడా జబర్దస్త్ కి చెందిన ఇద్దరు సందడి చేయనున్నారట. వారెవరో కాదు, నరేష్, రంగస్థలం మహేష్. జబర్దస్త్ నరేష్ అంటే అందరికీ సుపరిచితమే. చాలా కాలంగా ఆ షో చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక రంగస్థలం మహేష్ కూడా సినిమాల్లోకి రాకముందు, ఇదే షోలో చేసేవాడు. ఈ మధ్యే కాస్త సినిమా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో , బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలని అనుకుంటన్నాడట.

ఈ మేరకు బిగ్ బాస్ మేకర్స్ వారిని సంప్రదించగా, వీరిద్దరూ కూడా రావడానికి ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు, నటి సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రిత కూడా ఈ సారి సందడి చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ప్రతి సీజన్ లో ముందుగా వెళ్లిన కంటెస్టెంట్స్ తో పాటు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది. కానీ, ఈ సారి మాత్రం అలా వైల్డ్ కార్డు అనే కాన్సెప్ట్ లేకుండా చేస్తున్నారట.

అంతేకాకుండా, టాస్క్ లు గతంలోవి రిపీట్ కాకుండా, ఈ సారి కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఇక, ఈ సీజన్ లో చాలా మంది ఇంట్రస్టింగ్ పర్సన్స్ ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈటీవీ ప్రభాకర్, యూట్యూబ్ ఫేమ్ యాంకర్ నిఖిల్, సింగర్ మోహన భోగరాజు, ఢీ కొరియోగ్రాఫర్ పండు, టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు ఆయన భార్య కూడా వస్తున్నారట. మరి కొందరి పేర్లు కూడా వినపడుతున్నాయి. అంతేకాకుండా, ఈ సారి గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచాలని చూస్తున్నారట. అంటే, ఈ సీజన్ లో అందమైన అమ్మాయిలు ఎక్కువ మందిని తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.