Begin typing your search above and press return to search.

ఈ వారం 16 సినిమాలు, 8 సిరీస్​లు.. మీరేం చూస్తారు

సెప్టెంబరు ఆఖరి వారం వచ్చేసింది. అందులోనూ సలార్ రిలీజ్ డేట్ వాయిదా పడటంత వల్ల పలు చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్‌ ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి.

By:  Tupaki Desk   |   25 Sep 2023 11:46 AM GMT
ఈ వారం 16 సినిమాలు, 8 సిరీస్​లు.. మీరేం చూస్తారు
X

సెప్టెంబరు ఆఖరి వారం వచ్చేసింది. అందులోనూ సలార్ రిలీజ్ డేట్ వాయిదా పడటంత వల్ల పలు చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్‌ ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. అలానే ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్​ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి.

నెట్‌ఫ్లిక్స్​లో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున (తెలుగు) సెప్టెంబరు 24, ద డెవిల్స్‌ ప్లాన్‌ (కొరియన్‌ సిరీస్‌) సెప్టెంబరు 26, కాసిల్వేనియా (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 28, ఐస్‌కోల్డ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 28, లవ్‌ ఈజ్‌ ఇన్‌ ది ఎయిర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 28, చూనా (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 29, అక్టోబర్ 1నుంచి విజయ్ దేవరకొండ ఖుషి స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ద ఫేక్‌ షేక్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 26, హాస్టల్ డేజ్‌ (హిందీ) సెప్టెంబరు 27, కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 28, జెన్‌ వి (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 29 అందుబాటులో ఉండనున్నాయి.

డిస్నీ+హాట్‌స్టార్​లో కింగ్‌ ఆఫ్‌ కోత (మలయాళం) సెప్టెంబరు 28, లాంచ్‌పాడ్‌ (వెబ్‌సిరిస్‌2) సెప్టెంబరు 29, తుమ్‌ సే నహీ పాయేగా (హిందీ) సెప్టెంబరు 29.. సోనీలివ్​లో ఏజెంట్‌ (తెలుగు) సెప్టెంబరు 29 అదియా (తమిళ్‌) సెప్టెంబరు 29న రిలీజ్ కానున్నాయి.

బుక్‌ మై షోలో బ్లూ బీటిల్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 29... లయన్‌ గేట్‌ ప్లేలో సింపథీ ఫర్‌ ది డెవిల్‌(హాలీవుడ్)సెప్టెంబరు 29.... హైరిచ్‌లో ఎన్నివర్‌ (మలయాళం) సెప్టెంబరు 29, క్రాంతి వీర (కన్నడ) సెప్టెంబరు 29... ఆహాలో పాపం పసివాడు (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 29నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో హిట్ మూవీ ఖుషితో పాటు ఫ్లాప్ చిత్రాలు ఏజెంట్, కింగ్ ఆఫ్ కోత, త్వరలోనే రిలీజ్ కానున్న కుమారి శ్రీమతి సిరీస్​పై చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక థియేటర్లలో రామ్ పోతినేని స్కంద, లారెన్స్ చంద్రముఖి 2, శ్రీకాంత్ అడ్డాల పెద కాపు 1, వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి వ్యాక్సిన్ వార్​ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటిలో ఏ చిత్రాలు ఆడతాయో చూడాలి..