Begin typing your search above and press return to search.

ఓటీటీ లో ఈ వారం సందడే సందడి

సినిమా థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలకు పోటీగా ఓటీటీ సినిమా లు మరియు సిరీస్ లు వినోదాల విందును అందిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   20 Oct 2023 12:08 PM GMT
ఓటీటీ లో ఈ వారం సందడే సందడి
X

ప్రతి వారం థియేటర్‌ లలో ఎలా అయితే సినిమాలు విడుదల అవుతూ సందడి చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయో అలాగే ప్రతి వారం కూడా ఓటీటీ లో సినిమాలు మరియు సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తూ ప్రేక్షకులకు మస్త్‌ వినోదాన్ని పంచుతున్న విషయం తెల్సిందే. సినిమా థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలకు పోటీగా ఓటీటీ సినిమా లు మరియు సిరీస్ లు వినోదాల విందును అందిస్తున్న విషయం తెల్సిందే.

ఇక ఈ వారం కూడా పలు సినిమాలు మరియు సిరీస్ లు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు లో రెండు వారాల విడుదల అయిన సుధీర్ బాబు హీరోగా నటించిన మామా మశ్చీంద్ర మూవీ ని ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అమెజాన్‌ తో పాటు ఆహాలో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయవచ్చు.

ఇక డ్రీమ్ గర్ల్‌ 2 ను ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. హిందీ కామెడీ షో అయిన ఇందులో ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే హిందీ ప్రేక్షకుల్లో ఈ షో పై మంచి బజ్ ఉంది. కనుక నెట్‌ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూసేందుకు సిద్ధం అవుతున్నారు.

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్ర లో నటించిన మ్యాన్షన్‌ 24 ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ టీవీ హోస్ట్‌ ఓంకార్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఓంకార్‌ ఈ సిరీస్ ను రూపొందించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ వారంలోనే నన్‌ 2 ను కూడా అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.