Begin typing your search above and press return to search.

ఈ వారం 15 సినిమాలు 4 సిరీస్​లు.. ఆ ముడిటిపైనే స్పెషల్ ఫోకస్

అలాగే స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ మూవీస్​, సిరీస్​ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2023 11:37 AM GMT
ఈ వారం 15 సినిమాలు 4 సిరీస్​లు.. ఆ ముడిటిపైనే స్పెషల్ ఫోకస్
X

గత వారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసి సంగతి తెలిసిందే. అయితే ఈ వారం అన్ని చిన్న చిత్రాలే ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యాయి. అలాగే స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ మూవీస్​, సిరీస్​ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో సందది చేయనున్న చిత్రాలేంటో చూద్దాం..

శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో సయ్యద్‌ సొహైల్‌, రూపా కొడువయూర్‌ జంటగా రూపొందిన చిత్రం 'మిస్టర్‌ ప్రెగ్నెంట్‌'. అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల కలిసి సంయుక్తంగా నిర్మించారు. సుహాసిని, అలీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ పురుషుడు ప్రెగ్నెంట్​ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్​తో ఇది తెరకెక్కించారు.

రచయిత అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతూ సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేమ్‌కుమార్‌. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివప్రసాద్‌ పన్నీరు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' వంటి వినోదాత్మక చిత్రాలతో అలరించిన దర్శకుడు కె.విజయభాస్కర్‌ తనయుడు శ్రీ కమల్‌ హీరోగా పరిచయం అవుతూ వస్తున్న 'జిలేబి' ఆగస్టు 18న థియేటర్‌లలో విడుదల కానుంది. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

తమిళ నటుడు సంతానం కీలక పాత్రలో నటించిన హారర్‌ కామెడీ మూవీ 'డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా' ఆగస్టు 18న తెలుగులోనూ విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. అలాగే సక్సెఫుల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ఫ్రాంఛైజీ 'పిజ్జా' నుంచి వస్తున్న 'పిజ్జా3' ఆగస్ట్ 18నే రానుంది.

ఇంకా ఈ వారం ఓటీటీలోనూ మరిన్ని సినిమాలు/సిరీస్‌లు వస్తున్నాయి. 'నెట్‌ఫ్లిక్స్‌'లో అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15, నో ఎస్కేప్‌ రూమ్‌ (హాలీవుడ్‌)ఆగస్టు 15, డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఆగస్టు 16, గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 18, మాస్క్‌ గర్ల్ (కొరియన్‌ సిరీస్‌) ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌లో హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 18, జీ5లో ఛత్రపతి (హిందీ) ఆగస్టు 15, బుక్‌ మై షోలో బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15, డాంఫైర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15, స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15, లయన్స్‌ గేట్ ప్లేలో మైండ్‌ కేజ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15, జియోలో తాలీ (హిందీ) ఆగస్టు 15, ఫ సే ఫాంటసీ (హిందీ) ఆగస్టు 15, ఈటీవీ విన్‌లో అన్నపూర్ణా ఫొటో స్టూడియో (ఆగస్టు 15) అందుబాటులో ఉండనున్నాయి. వీటన్నింటిలో థియేటర్లలో మిస్టర్ ప్రెగ్నెంట్​, తాళీ, గన్స్ అండ్ గులాబ్స్​పై కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి.