Begin typing your search above and press return to search.

ఈ వీకెండ్‌ కి కూడా ఓటీటీ వినోదాల విందు ఖాయం

థియేటర్‌ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్‌ దక్కించుకున్న సినిమాలను ఓటీటీ స్ట్రీమింగ్‌ చేద్దామని ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 9:25 AM GMT
ఈ వీకెండ్‌ కి కూడా ఓటీటీ వినోదాల విందు ఖాయం
X

ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాలు ఎంత రెగ్యులర్‌ గా వస్తున్నాయో అంతే రెగ్యులర్ గా ప్రతి శుక్రవారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు వస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన సినిమాలు రెండు మూడు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కను థియేటర్‌ స్క్రీనింగ్‌ కంటే కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ పైనే ఆసక్తి చూపిస్తున్నారు.

థియేటర్‌ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్‌ దక్కించుకున్న సినిమాలను ఓటీటీ స్ట్రీమింగ్‌ చేద్దామని ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేయకున్నా కూడా ఓటీటీ లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం లో కూడా పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ వీకెండ్‌ లో తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీ ద్వారా రామ్‌ హీరో గా నటించిన స్కంద సినిమా రాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే థియేట్రికల్‌ రిలీజ్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు చేయలేదు. అయితే సినిమా కచ్చితంగా ఓటీటీ లో భారీ వ్యూస్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వారంలోనే షారుఖ్ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన జవాన్‌ సినిమాను తెలుగు తో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదే వారం లో మంత్ ఆఫ్ మధు సినిమా ను కూడా ఓటీటీ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో జాతిరత్నాలు రేంజ్ సినిమా అంటూ పేరు దక్కించుకున్న 'మ్యాడ్‌' సినిమాను కూడా ఇదే వారంలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కనుక కచ్చితంగా ఈ వారం ముఖ్యంగా ఈ వీకెండ్‌ ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు ఖాయం.