Begin typing your search above and press return to search.

ఈ వారం బాక్సాఫీస్ హీరో ఎవరో

ఈ ఫ్రైడే అనగా ఈ ఆగస్ట్ ఆఖరి వారి ఇంట్రెస్టింగ్​ మూవీస్ రిలీజ్​కు రెడీ అయ్యాయి. ఓటీటీలోనూ పలు హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

By:  Tupaki Desk   |   23 Aug 2023 9:02 AM GMT
ఈ వారం బాక్సాఫీస్ హీరో ఎవరో
X

గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ డల్​గా సాగింది. రిలీజైన చిన్న చిత్రాలు ఏవీ అంతగా ఆకట్టుకోలేదు. సంతోశ్ శోభన్ ప్రేమకుమార్​, బిగ్​బాస్​ సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్​ అటెన్షన్ అందుకున్నప్పిటికీ అవి కూడా బోల్తా కొట్టాయి. దీంతో సినీ ప్రియుల కళ్లన్నీ ఈ వారం బాక్సాఫీస్​ ముందు విడుదలయ్యే సినిమాలపై పడ్డాయి. ఈ ఫ్రైడే అనగా ఈ ఆగస్ట్ ఆఖరి వారి ఇంట్రెస్టింగ్​ మూవీస్ రిలీజ్​కు రెడీ అయ్యాయి. ఓటీటీలోనూ పలు హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

దీంతో ఈ ఫ్రైడే చిత్రాల్లో ఏవీ హిట్​ టాక్​ను అందుకుంటాయి. ఏవీ బోల్తా కొడతాయి. అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ వీకెండ్ ట్రీట్​ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన డబ్బింగ్ సినిమా కింగ్ ఆఫ్ కోతతో మొదలు కానుంది. ఆగస్ట్ 24న ఈ చిత్రం రిలీజ్ కానుంది. గ్యాంగ్​ స్టర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాపై మంచి ఆసక్తే నెలకొంది. కంటెంట్ క్లిక్​ అయితే ఈ వారం ఈ చిత్రందే పై చేయి అవ్వొచ్చు.

అయితే ఈ చిత్రానికి పోటీగా తర్వాత రోజే రెండు తెలుగు సినిమాలు వస్తున్నాయి. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రవీణ్‌ సత్తారు కాంబోలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'గాండీవధారి అర్జున'. వరుణ్​.. సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపించిన ఈ సినిమా, కార్తికేయ, నేహా శెట్టి కలిసి క్లాక్స్‌ దర్శకత్వంలో నటించిన 'బెదురు లంక 2012' ఆగస్ట్ 25న రానున్నాయి. ఈ రెండు చిత్రాలకు లిమిటెడ్ బజ్​ మాత్రమే ఉంది. చూడాలి తొలి రోజు టాక్ ఆధారంగా ఈ సినిమా రిజల్ట్​ తెలుస్తుంది. ఇంకా ఈ ఆగస్టు 25న హిందీ చిత్రం డ్రీమ్ గర్ల్​ 2, కన్నడ చిత్రం రాజ్​ బీ శెట్టి 'టాబీ' కూడా విడుదల కానున్నాయి.

ఇక 26వ తేదీన.. చిన్న చిత్రంగా రిలీజై కన్నడలో ఘనవిజయం సాధించిన 'హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే'... తెలుగులో 'బాయ్స్‌ హాస్టల్‌' పేరుతో విడుదల కానుంది. యూత్​ఫుల్​ ఎంటర్​టైనర్​గా రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద వండర్స్ సృష్టిస్తుందని అంతా అనుకుంటున్నారు.

ఒకవేళ థియేటర్లలోని సినిమాలు క్లిక్​ అవ్వకపోతే.. ఎలాగో ఓటీటీలో పవన్​ కల్యాణ్​-సాయితేజ్ బ్రో, ఆహాలో ఆనంద్​ దేవరకొండ-వైష్ణవి చైతన్య ఆహా ఆగస్ట్ 25న రానున్నాయి. వీటితో పాటు పలు చిత్రాలు, సిరీస్​ ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. చూడాలి మరి ఈ వారం బాక్సాఫీస్ ఎలా ఉండబోతుందో.