Begin typing your search above and press return to search.

కల్కి 'అశ్వథ్థామ'.. ఇది డైరెక్టర్ అసలు ఆలోచన!

కానీ దర్శకుడు మాత్రం సినిమాలో ఎన్నో కొత్త అంశాలను చూపించబోతున్నట్లుగా అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   24 April 2024 6:10 AM GMT
కల్కి అశ్వథ్థామ.. ఇది డైరెక్టర్ అసలు ఆలోచన!
X

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కల్కి సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సినిమాలో కల్కి చుట్టూ బలమైన అంశాలను ఎలా చూపిస్తాడో? అనే చాలా రకాలు ప్రశ్నలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొదట ఈ సినిమా అంతగా క్లిక్ అవ్వకపోవచ్చని కామెంట్స్ అయితే గట్టిగానే వినిపించాయి. కానీ దర్శకుడు మాత్రం సినిమాలో ఎన్నో కొత్త అంశాలను చూపించబోతున్నట్లుగా అర్థమవుతుంది.

ముఖ్యంగా అశ్వథ్థామ పాత్ర విషయంలోనే అతను ఆలోచించిన విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక నటుడి ని ఒక పాత్ర కోసం అనుకున్నప్పుడు దాని చుట్టూ ఎన్నో రకాల అంశాలు ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు ఒకరు కాకపోతే ఇంకొకరు చేస్తారులే అనే విధంగా కొంతమంది దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. కానీ ఈ సినిమాలో అశ్వథ్థామ పాత్ర కోసం మాత్రం అమితాబచ్చన్ తప్పితే మరొకరిని ఊహించుకోలేదని తెలుస్తోంది.

అసలే అమితాబ్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఏది పడితే దాన్ని ఆయన అసలు ఒప్పుకోరు. ఇక అలాంటిది ఆయన కల్కి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అంటే తప్పకుండా పాత్రలో బలమైన అంశాలు ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. అయితే అశ్వథ్థామ క్యారెక్టర్ గురించి మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి.

రీసెంట్ గా విడుదల చేసిన అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డిఏజింగ్ టెక్నాలజీతో అమితాబ్ ను బలమైన యువ అశ్వథ్థామగా చూపించబోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఒక శాపం వల్లనే అశ్వథ్థామ గుర్తుపట్టలేనంత స్థితికి మారిపోతాడు. ఇక అతను యువకుడిగా ఉంటే ఉంటే ఎలా ఉంటాడు అనే ఆలోచనను తెరపైకి తీసుకురావడం అంత సులువు కాదు.

80 ఏళ్ళ వయసులో ఉన్న అమితాబ్ వయసును తగ్గించి చూపించారు అంటే నాగ్ అశ్విన్ ఎంత రిస్క్ చేశాడో అర్థం చేసులోవచ్చు. ముఖ్యంగా చరిత్ర పురాణాలు తిరిగేసిన దర్శకుడు ఒక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలే అమితాబ్ బచ్చన్ హైట్ తో అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అశ్వథ్థామ కూడా చాలా ఎత్తుగా ఉంటాడు. బిగ్ బి ని సెలెక్ట్ చేసుకోవడానికి హైట్ కూడా ఒక కారణం.

అమితాబ్ అసలు హైట్ ఆరడుగుల రెండు అంగుళాలు. అయితే అశ్వథ్థామ హైట్ ప్రభాస్ ను కూడా డామినేట్ చేసేలా ఉండాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఇంకాస్త ఎక్కువ పొడవుగా అమితాబ్ బచ్చన్ ల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని మిగతా అన్ని పాత్రల కంటే కూడా అశ్వథ్థామ పాత్ర చాలా హైట్ కలిగి ఉంటుందట. మొత్తంగా క్యారెక్టర్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మిగతా ఎవరు కూడా సెట్టవ్వరు అనే విధంగా అమితాబ్ ఆ పాత్రలో కనిపించబొతున్నట్లు తెలుస్తోంది.