Begin typing your search above and press return to search.

దృశ్యం.. ఈసారి ప్రపంచం మొత్తం చూసేలా..

ఇదిలా ఉంటే ఆ మధ్యకాలంలో కొరియన్ భాషలో కూడా దృశ్యం మూవీ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 11:21 AM GMT
దృశ్యం.. ఈసారి ప్రపంచం మొత్తం చూసేలా..
X

మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి సీక్వెల్ కూడా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ దృశ్యం మూవీ ఇప్పటి వరకు ఏడు భాషలలో రీమేక్ అయ్యింది. నేపాలీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్యకాలంలో కొరియన్ భాషలో కూడా దృశ్యం మూవీ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో కొరియన్ భాషలో రీమేక్ అయిన మొదటి ఇండియన్ సినిమాగా దృశ్యం రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసేలా హాలీవుడ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారంట. బిగ్ ప్రొడక్షన్ హౌస్ పనోరమా స్టూడియోస్ ఈ మూవీ హాలీవుడ్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ తాజాగా హాలీవుడ్ లో తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.

గల్ఫ్ స్ట్రీమ్ మరియు జోట్ ఫిల్మ్స్ వారితో కలిపి దృశ్యం చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారని నిర్మాత అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. కొరియన్ భాషలో కూడా పనోరమా స్టూడియోస్ బ్యానర్ మీదనే రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అనేది త్వరలో నిర్ణయించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. హాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.

ఇప్పటి వరకు 10 ఇండియన్ సినిమాలు హాలీవుడ్ లో అఫీషియల్ గా రీమేక్ అయ్యాయి. వాటిలో ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ జంటగా నటించిన ఆహ్వానం కూడా ఉంది. డివోర్స్ ఇన్విటేషన్ టైటిల్ తో రీమేక్ అయిన ఈ చిత్రానికి ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించడం విశేషం. అలాగే కమల్ హాసన్ నటించిన అభయ్ మూవీ కిల్ బిల్ గా హాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.

ఇప్పుడు దృశ్యంతో మలయాళీ చిత్రం హాలీవుడ్ లో రీమేక్ అవుతూ ఉండటం విశేషం. దృశ్యం ఫ్రాంచైజ్ ని జీతూ జోసెఫ్ ఇంకా కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దృశ్యం 3 కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారనేది చూడాలి.