Begin typing your search above and press return to search.

ఈసారి సమ్మర్ బాక్సాఫీస్ హీట్.. ఎలా ఉంటుందో..

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 3:30 PM GMT
ఈసారి సమ్మర్ బాక్సాఫీస్ హీట్.. ఎలా ఉంటుందో..
X

సినిమాలకి సంక్రాంతి సీజన్ తర్వాత మరల వేసవిలోనే ఎక్కువ హడావిడి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలలు పరీక్షా సమయం కావడంతో మీడియం రేంజ్ నుంచి పెద్ద హీరోల వరకు అందరూ మార్చి నెలాఖరు నుంచి తమ సినిమాలని రిలీజ్ చేసుకునే ప్లాన్ చేసుకుంటారు. ఫిబ్రవరి రెండో మూడో వారం నుంచి మార్చి మూడో వారం వరకు సినిమాలు రిలీజ్ చేయడానికి ఎవరూ మొగ్గు చూపించరు.

అయితే ఈ సారి పరిస్థితి కొద్దిగా మారినట్లు కనిపిస్తోంది. మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా ఫిబ్రవరి నుంచి మార్చి మూడో వారం మధ్యలో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. వరుణ్ తేజ్, గోపీచంద్, విశ్వక్ సేన్ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మూడు కూడా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలే కావడం విశేషం. వరుణ్ తేజ్ హీరోగా తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ మార్చి 1న రిలీజ్ అవుతోంది .

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన గామి మూవీ మార్చి 8న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాలో చాందినీ చౌదరి ఫిమేల్ లీడ్ లో చేస్తోంది. చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ భాగానే ఉన్నాయి.

మార్చి 15 గోపీచంద్ హీరోగా హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన భీమా మూవీ రిలీజ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. మైథలాజికల్ ఫాంటసీ మిక్స్ చేసిన కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇలా మార్చి మొదటి వారం నుంచి మూడో వారం వరకు ప్రతి శుక్రవారం ఒక సినిమా అయితే థియేటర్స్ లోకి వస్తోంది. దీంతో వేసవి సినిమా వినోదం ముందుగానే మొదలైంది అనే మాట వినిపిస్తోంది.

రెగ్యులర్ గా వచ్చే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ అన్ సీజన్ లో వస్తోన్న ఈ చిత్రాలకి ప్రేక్షకాదరణ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాలి. ఈ మూడింటిలో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి. హై బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.