Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ పై ఇదేం ట్విస్ట్!

అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ లేదు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 8:47 AM GMT
ఆ సీక్వెల్ పై ఇదేం ట్విస్ట్!
X

కార్తీక్ ఆర్య‌న్ హీరోగా 'ఆషీకి-3' కి రంగం సిద్ద‌మ‌వుతున్న‌ట్లు ఏడాది కాలంగా ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. వరుస విజ‌యాలు మీదున్న కార్తీక్ ని ఈ ప్రాజెక్ట్ కి ఎంపిక చేయ‌డంతో 'ఆషీకీ-3'పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. టీ-సిరీస్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ట్లు మ‌హేష్ భ‌ట్ అధికారిక క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ లేదు.

ఈ నేప‌థ్యంలోనే 'తూ ఆషీకీ హై' అంటూ ఓ టైటిల్ తెర‌పైకి వ‌చ్చింది. దీంతో ఇదే 'ఆషీకీ -3' అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. 'ఆషీకీ -3' టైటిల్ నే ఈ విధంగా కొత్త టైటిల్ తో తెర‌పైకి తెస్తున్న‌ట్లు వినిపిం చింది. తాజాగా ఈ ప్ర‌చారంపై చిత్ర వ‌ర్గాలు స్పందించాయి. ఇది ఆషీకీ కి సీక్వెల్ గా వ‌స్తోన్న చిత్రం కాద‌ని. .వేరే క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మ‌ని తెలిపారు. దీంతో ఆషీకీ అభిమానుల‌పై ఒక్క‌సారిగా నీళ్లు చ‌ల్లిన‌ట్లు అయింది.

ఆషీకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా? అని ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆప్రాంచైజీకి ప్ర‌త్యేక‌మైన అభిమానులు ఉండ‌టంతోనే ఈ ర‌క‌మైన క్రేజ్ ..బ‌జ్ ఏర్ప‌డింది. కానీ ఆ ప్రాజెక్ట్ ని మాత్రం ప‌ట్టాలెక్కించ‌డం లేదు. మ‌రి కొత్త ఏడాదిలోనైనా మేక‌ర్స్ ఆ దిశ‌గా ఆలోచన చేస్తారా? అన్న‌ది చూడాలి. ఇక తూ ఆషీకీ హై విష‌యానికి వ‌స్తే.. శ‌షి క‌పూర్..రేఖ తారాగ‌ణంతో 1981 లో రిలీజ్ అయిన 'బ‌సేరా' అనే చిత్రం ఆధారంగా 'తూ ఆషీకీ హై' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

అయితే ఈసినిమాలో హీరో కార్తీక్ ఆర్య‌న్ కావ‌డం విశేషం. ఆయ‌న‌కు జోడీగా 'యానిమ‌ల్' తో ఫేమ‌స్ అయిన త్రిప్తి డిమ్రి ఎంపికైంది. ఈ ఏడాది చివర్లో సినిమా ప్రారంభం కానుందని స‌మాచారం. ఇందులో మ‌రో హీరో యిన్ కి కూడా ఛాన్స్ ఉందిట‌. ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ 'భూల్ భుల‌య్య‌-3' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.