Begin typing your search above and press return to search.

లియో - రజినీకాంత్.. ఇది అసలు మ్యాటర్

ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మొదటి రోజు 150 కోట్ల వరకు లియో మూవీకి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 8:01 AM GMT
లియో - రజినీకాంత్.. ఇది అసలు మ్యాటర్
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై హైఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డానికి తగ్గట్లుగానే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లియో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది.

దీనిని బట్టి సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కోలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం లియో సినిమాకి ఈ లెవల్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మొదటి రోజు 150 కోట్ల వరకు లియో మూవీకి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లియో సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. రజినీకాంత్ లియో సినిమా కోసం ఒక మాట చెప్పాలని అతని పీఆర్వోని విజయ్ అడిగినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు.

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంట. నిజానికి లియో సినిమాకి ఉన్న హైప్ తోనే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా ప్రత్యేకంగా సూపర్ స్టార్ లియో మూవీని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని దళపతి ఫ్యాన్స్ అంటున్నారు. దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో సినిమా రిలీజ్ కి వస్తోన్న ఆదరణ చూస్తేనే తెలిసిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

రజినీకాంత్ ని సంప్రదించడం అనేదాంట్లో ఎలాంటి వాస్తవం అయితే లేదని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట. లియో రిలీజ్ తర్వాత లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబో మూవీని ఇప్పటికే ఎనౌన్స్