Begin typing your search above and press return to search.

750 వాహనాలు.. సలార్ లో ఇదే హైలైట్‌

సలార్‌ సినిమాలోని ఆ యాక్షన్ సన్నివేశం చూసిన తర్వాత ప్రేక్షకులు తాము హాలీవుడ్‌ సినిమాను చూశామా అన్నట్లుగా ఫీల్ అవ్వడం ఖాయం అన్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 10:21 AM GMT
750 వాహనాలు.. సలార్ లో ఇదే హైలైట్‌
X

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ సినిమా ను డిసెంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది. ఈసారి విడుదల పక్కా అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ఈ క్రిస్మస్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌ రచ్చ రచ్చ చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక యాక్షన్‌ సన్నివేశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సలార్‌ సినిమాలోని ఆ యాక్షన్ సన్నివేశం చూసిన తర్వాత ప్రేక్షకులు తాము హాలీవుడ్‌ సినిమాను చూశామా అన్నట్లుగా ఫీల్ అవ్వడం ఖాయం అన్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

ఆ యాక్షన్ సన్నివేశం చిత్రీకరించడానికి గాను ఏకంగా 750 రకాల విభిన్నమైన వాహనాలను ఉపయోగించారట. అంతే కాకుండా హాలీవుడ్ సినిమాలకు ఉపయోగించే అద్భుతమైన అత్యాధునిక టెక్నాలజీ ని కూడా సలార్ లోని ఆ యాక్షన్ సన్నివేశం కోసం వినియోగించారనే టాక్ వినిపిస్తోంది.

వందలాది మంది ఫైటర్స్ మరియు 750 రకాల వాహనాలు.. ఊహించుకుంటేనే ఆ యాక్షన్‌ సన్నివేశం ఎంత భారీగా ఉంటుందో అర్థం అవుతుంది. అలాంటిది వెండి తెరపై ఆ యాక్షన్ సన్నివేశం చూసే సమయంలో ప్రేక్షకుల ఫీల్‌ ను అర్థం చేసుకోవచ్చు.

కేజీఎఫ్‌ సినిమాలో మించిన యాక్షన్‌ సన్నివేశాలు ఎన్నో సలార్ లో ఉంటాయి అంటూ దర్శకుడు మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అన్నట్లుగానే ఆ స్థాయి లో యాక్షన్‌ సన్నివేశాలను సలార్ లో దించినట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో ప్రభాస్ రెండు పాత్ర ల్లో కనిపించబోతున్నాడు. సలార్ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెల్సిందే.