Begin typing your search above and press return to search.

ఫొటో టాక్.. ఇది 'దేవర' బలగం

ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి నిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారస్థాయికి చేరింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 6:39 AM GMT
ఫొటో టాక్.. ఇది దేవర బలగం
X

కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'దేవర' పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పోరాటాల శివ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు సినిమా ఎక్కువ భాగం సముద్రంలోనే ఉండడంతో ఇందుకోసం భారీ గ్రాఫిక్స్, VFX షాట్స్ ని ఉపయోగించబోతున్నారు.


ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి నిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారస్థాయికి చేరింది. గ్లింప్స్ లో ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడం.. ఎన్టీఆర్ మాస్ యాక్షన్, డైలాగ్.. అందుకు అనిరుద్ బీజీయం గ్లింప్స్ ని నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేశాయి. దీంతో ఈ గ్లింప్స్ కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆచార్య రిజల్ట్ తో బాగా డిసప్పాయింట్ అయిన కొరటాల శివ ఈసారి 'దేవర' కోసం బౌండరీస్ దాటి మరీ గ్రాండ్ స్కేల్లో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటివరకు టాలీవుడ్ లో రాని విజువల్ వండర్ ని దేవర తో ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడు. ఇందుకోసం సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచిన టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సినిమాను విజువల్ వండర్ గా చూపించేందుకు రత్నవేలు లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ దేవర కోసం పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడంతో ఏకంగా హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ ని రంగంలోకి దించారు కొరటాల శివ.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కి కెన్నీ బెట్స్ దేవరకి ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు. సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఇప్పటికే మూవీ టీం చెప్పింది. బాహుబలి సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఇక తాజాగా వీళ్లంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. దేవర గ్లింప్స్ రిలీస్ సందర్భంగా మూవీ టీం ఈ ఫోటోని రిలీజ్ చేసింది.

ఇందులో ఎన్టీఆర్, కొరటాల శివ తో పాటు సినిమా కోసం పని చేస్తున్న టెక్నీషియన్స్ కూడా ఉండడం విశేషం. ఇక ఈ పిక్ లో కొరటాల శివ, DOP రత్న వేలు, ఎన్టీఆర్, హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కి కెన్నీ బెట్స్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఉండడం గమనించవచ్చు. కాగా ఈ పిక్ లో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ హుడీ, బ్లూ జీన్స్ తో ఎన్టీఆర్ సింపుల్ లుక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది దీంతో నెట్టింట ఈ ఫోటో వైరల్ గా మారింది .