Begin typing your search above and press return to search.

ఇది సాయి పల్లవి క్రేజ్..

చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 12:19 PM GMT
ఇది సాయి పల్లవి క్రేజ్..
X

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమా అంటే చాలు సోషల్ మీడియాలో డిస్కషన్ షురూ అవుతుంది. విరాటపర్వం, గార్గి సినిమాల తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి లేటెస్ట్ గా నాగ చైతన్య సినిమాతో మళ్లీ ఆడియన్స్ ముందుకు వస్తుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

తండేల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున అటెండ్ అయ్యారు. హీరో నాగ చైతన్య, సాయి పల్లవి కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండేళ్ల తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్న సాయి పల్లవి తండేల్ సినిమాతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. తండేల్ పూజా కార్యక్రమంలో ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో మరే హీరోయిన్ కి లేని క్రేజ్ సాయి పల్లవికి ఉందని చెప్పొచ్చు. ఆమె చేస్తున్న సినిమాలు ఎంచుకుంటున్న పాత్రలు సాయి పల్లవికి ఈ క్రేజ్ తీసుకొచ్చాయి. తండేల్ సినిమాలో కూడా సాయి పల్లవి రోల్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ కోసం ముందు వేరొకరిని అనుకోగా సాయి పల్లవి మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని ఫిక్స్ అయ్యి ఆమెను తీసుకున్నారట. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి అలా కూడా సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు.

ఇక నాగ చైతన్యతో ఆల్రెడీ లవ్ స్టోరీ చేసి హిట్ అందుకున్న సాయి పల్లవి ఈ సినిమాతో మరోసారి అదే ఫలితాన్ని అందుకుంటుందని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై మేకర్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. నాగార్జున కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి సినిమా రేంజ్ ఏంటన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మాణంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని అనుకుంటున్నారు. చందు మీద పూర్తి నమ్మకం ఉంచి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా వస్తున్న తండేల్ సెట్స్ మీదకు వెళ్లకముందే మంచి బజ్ ఏర్పరచుకుంది. మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.