Begin typing your search above and press return to search.

ఈ తెరంతా అందాల‌కే అంకితం!

అయితే క‌రీనాక‌పూర్..కృతిస‌న‌న్...ట‌బులకు అలాంటి కంటెంట్ కుద‌ర‌డంతోనే 'ది క్రూ' అనే చిత్రానికి క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 7:14 AM GMT
ఈ తెరంతా అందాల‌కే అంకితం!
X

అందాల భామ‌లంతా ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌డం అన్న‌ది చాలా అరుదు. వాళ్లు అలా క‌నిపించాలి అంటే అంత‌కు మించి ఆ క‌థ బ‌లంగా ఉండాలి. అందులో పాత్ర‌లు అంత‌కు మించి ధీటుగా తీర్చిదిద్దాలి. అప్పుడే అలాంటి కాంబినేష‌న్స్ కి ఆస్కారం ఉంటుంది. అయితే క‌రీనాక‌పూర్..కృతిస‌న‌న్...ట‌బులకు అలాంటి కంటెంట్ కుద‌ర‌డంతోనే 'ది క్రూ' అనే చిత్రానికి క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది.


ఈ ముగ్గురు కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాజేష్ కృష్ణ‌న్ తెర‌కెక్కిస్తున్నాడు. 'లేడీస్ అంట్ జెంటిల్ మెన్ మా విమానంలోకి మీ అంద‌రికీ స్వాగ‌తం. మా సిబ్బంది మిమ్మ‌ల్ని అంద‌ర్నీ జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డానికి సిద్దంగా ఉన్నారు అంటూ వారి ఎయిర్ హోస్ట‌స్ టీమ్ ని చిత్ర యూనిట్ ప‌రిచ‌యం చేసింది. ముగ్గురు భామ‌ల్ని ఎయిర్ హోస్ట‌స్ గా ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నారు.

సాధార‌ణంగా ఎయిర్ హోస్టెస్ అంటే అంద‌మైన అమ్మాయిలే క‌నిపిస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిల‌కు పోటీగా ఈ ముగ్గురు దిగుతున్నారు. ప్ర‌యాణికుల్ని త‌మ అంద‌చందాల‌తో థియేట‌ర్లో క‌ట్టిపడేయడానికి రెడీ అవుతున్నారు. కామెడీ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. దిల్జీత్ దోసాంజ్..క‌పిల్ శ‌ర్మ లాంటి వారు న‌టించ‌డంతో సినిమాలో వినోదం పీక్స్ లో ప‌డ‌టానికి అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇక ట‌బు..కృతిస‌న‌న్..క‌రీనా క‌పూర్ ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమాలోనూ క‌లిసి న‌టించ‌లేదు. తొలిసారి ముగ్గురు ఒకే ప్రేమ్ లో క‌నిపిస్తున్నారు. మ‌రి ఈ ఎయిర్ హోస్ట‌స్ ప్రేక్ష‌కుల్ని ఎలా ఆక‌ట్టుకుంటారో చూడాలి. ఏక్తా క‌పూర్-రియా క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురా వ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.